Site icon NTV Telugu

West Bengal: బెంగాల్‌లో మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. క్యాంపస్ సమీపంలోనే దారుణం..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఒడిశాలోని జలేశ్వర్ కు చెందిన బాధితురాలు, పశ్చిమ బెంగాల్ లోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూర్ సమీపంలో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతోంది. ఇది రాజధాని కోల్‌కతా నుంచి 170 కి.మీ దూరంలో ఉంది.

శుక్రవారం రాత్రి 8.30 గంటలకు విద్యార్థిని తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి క్యాంపస్ బయటకు వచ్చింది. క్యాంపస్ గేట్ దగ్గర ఒక వ్యక్తి ఆమెను ఆస్పత్రి వెనక ఉన్న నిర్జన ప్రాంతానికి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం, బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపారు. కాలేజ్ సిబ్బందితో పాటు మహిళతో ఉన్న ఆమె ఫ్రెండ్‌ను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Read Also: Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..

ఈ సంఘటన గురించి తన కుమార్తె స్నేహితుడు తనకు తెలియజేశాడని విద్యార్థిని తండ్రి విలేకరులకు తెలిపారు. నేను అక్కడికి చేరుకున్నప్పుడు, నా కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. తన కుమార్తె పానీపూరీ తినడానికి క్యాంపస్ బయటకు వచ్చింది., ఆమె ప్రియుడు వాసిఫ్ అలీ తనను కలవడానికి పిలిచాడని ఆయన చెప్పారు.

ఆమె క్యాంపస్ బయటకు వచ్చిన తర్వాత, బయట నలుగురైదుగురు వ్యక్తులు ఉన్నారని, ఇందులో ఒకడు ఆమెను ఈడ్చుకెళ్లి, అత్యాచారాని పాల్పడినట్లు వెల్లడించారు. ఆమె మొబైల్ ఫోన్ తిరిగి ఇవ్వడానికి రూ. 3000 డిమాండ్ చేశాడని చెప్పాడు. తన కుమార్తెకు న్యాయం జరగాలని, ఇలాంటి సంఘటనలు మరే అమ్మాయికి జరగొద్దని ఆయన కోరారు.

Exit mobile version