West Bengal: పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై వరస అత్యచార సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ పీజీ డాక్టర్‌పై అత్యాచార ఘటన మరవక ముందే, చాలా మంది మహిళలు రకమైన దారుణాలకు గురయ్యారు. తాజాగా, బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో ఓ ప్రైవేట్ కాలేజీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సామూహిక అత్యాచారానికి గురైంది.