Tragedy : పెద్ద శంకరంపేట్.. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళుతూ ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట 161 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన కురుమ లింగమయ్య 45. కురుమ సాయవ్వ 40 కుమారుడు సాయిలు 18 కూతురు మానస 8 ఒకే కుటుంబానికి చెందినవారు గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం తెలుసుకున్న వెంటనే అల్లాదుర్గం ఎస్సై శంకర్. పెద్ద శంకరంపేట ఏఎస్ఐ సంగమేశ్వర్ లు వివరాలు సేకరిస్తున్నారు.. రెండవ విడత లో భాగంగా నిజాంసాగర్ మండలం మాగి గ్రామపంచాయతీలో ఓటు వేసేందుకు హైదరాబాదు నుండి సొంత గ్రామానికి బైక్ పై వస్తుండగా పెద్ద శంకరంపేట శివారులోని 161 జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.. పోలీసులు వివరాలు సేకరించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..