Married Woman Killed Her Husband With Help Of Lover In Yeswanthpur: వివాహేతర సంబంధాల మోజులో పడి జనాలు తమ సంసారాల్ని కూల్చుకుంటున్నారు. భాగస్వామ్యుల్ని చంపుకుంటున్నారు. ఆ తర్వాత జరిగే పర్యావసానాలు, కుటుంబ విలువల్ని ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. అడ్డుగా ఉన్నారని.. ప్లాన్స్ వేసి మరీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక వివాహిత సైతం అలాంటి దారుణానికే పాల్పడింది. తన ప్రియుడితో కలిసి జీవించడం కోసం, అత్యంత కిరాతకంగా భర్తను చంపేసింది. ఈ హత్యకేసు నుంచి తప్పించుకోవడం కోసం, ఒక డ్రామా కూడా నడిపించింది. కానీ.. కూతురు ఇచ్చిన ట్విస్ట్‌తో కటకటాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
యశవంతపురలోని సంజయ్ నగరకు చెందిన ఆంజనేయ (45)కు చాలా సంవత్సరాల క్రితం అనిత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కట్ చేస్తే.. ఒక గార్మెంట్స్ పరిశ్రమలో పని చేస్తున్న అనితకు, అక్కడ రాకేశ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల తర్వాత అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తకు తెలియకుండా అనిత తన ప్రియుడితో రాసలీలలు కొనసాగించింది. భర్త ఇంట్లో లేనప్పుడు.. రాకేశ్‌ని నేరుగా ఇంటికి పిలిపించుకునేది. అయితే.. ఓసారి ఆంజనేయ వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అప్పుడు ఇద్దరికీ తగిన బుద్ధి చెప్పాడు. ఇలాంటి పాడు పనులు మానుకోవాలని భార్య అనితకు సూచించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. భర్త మాటని పట్టించుకోకుండా, రాకేశ్‌తో తన సంబంధాన్ని కొనసాగించింది. దీంతో.. కోపాద్రిక్తుడైన ఆంజనేయ, అనిత చేత పని మాన్పించి, ఇంట్లోనే ఉండమన్నాడు.
Man Frozen With Noodles: వేడివేడి నూడుల్స్ తినాలనుకున్నాడు.. గడ్డకట్టుకుపోయాడు
కానీ.. అనిత ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండలేకపోయింది. రాకేశ్‌తోనే ఉండాలని నిర్ణయించుకుంది. అలా ఉండాలంటే, తన భర్త అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇందుకు రాకేశ్, అనిత కలిసి ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. గతేడాది జూన్‌లో ఆంజనేయ ఇంట్లో నిద్రపోతున్నప్పుడు, అనిత తన ప్రియుడు రాకేశ్‌ని ఇంటికి పిలిపించింది. ఇద్దరు కలిసి ఆంజనేయుడిని గొంతు పిసికి చంపేశారు. అనంతరం తన భర్త గుండెపోటుతో మృతిచెందాడని అనిత నమ్మించింది. అయితే.. ఇటీవల అనిత కూతురు ‘తన అమ్మే నాన్నను చంపింది’ అని బంధువులతో తెలిపింది. దీంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అనితని అదుపులోకి తీసుకుని విచారించగా.. అక్రమ సంబంధం విషయమై తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుంది. దాంతో ఇద్దరినీ జైలుకు పంపారు.