Married Woman Commits Suicide Over Husbands Extramarital Affair: రెండు నిమిషాలు.. కేవలం రెండే రెండు నిమిషాల మోజు కోసం పచ్చని కాపురాల్ని కూల్చేసుకుంటున్నాయి జంటలు. ఏడడుగులు నడిచి, ఎల్లప్పుడూ నీతోనే ఉంటానని హామీలిచ్చుకునే జంటలు.. కామ కోరికల కోసం వాటిని తుంగలో తొక్కేసి, దారుణ ఘటనలకు తెరలేపుతున్నారు. ఇప్పుడు ఓ భర్త చేసిన పాడుపనికి.. పాపం భార్య బలి అయ్యింది. భర్త పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని తట్టుకోలేక, ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బెంగళూరులోని రామ్మూర్తి నగర రిచర్డ్ గార్డెన్‌లో నివాసముంటున్న అభిషేక్‌కి 11 నెలల క్రితం శ్వేతతో వివాహమైంది. అభిషేక్ టీసీఎస్ కంపెనీలో ఐటీ ఇంజనీరు కాగా.. శ్వేత ఐబీఎం కంపెనీలో టెక్కీగా పని చేస్తోంది. పెళ్లికి ముందు అభిషేక్‌కు ఓ యువతితో సంబంధం ఉండేది. అయితే.. పెళ్లయ్యాక కూడా అతడు అనైతిక బంధాన్ని కొనసాగించాడు. భార్యతో సాఫీగా సంసారం చేయకుండా.. అమ్మాయి మోజులో పడి, భార్యకి దూరంగా ఉంటూ వచ్చాడు. మొదట్లో పరిస్థితులు బాగానే ఉండేది కానీ, భర్త ప్రవర్తనలో వచ్చిన మార్పు శ్వేతకు అనుమానం కలిగించింది. ఈ క్రమంలోనే అభిషేక్ మరో అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది.
ఈ వివాహేతర సంబంధం విషయంలో భార్యాభర్తల మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. పెద్దలు రాజీ కుదిర్చి, వీరిని కలపడమూ జరిగింది. కొన్నాళ్ల క్రితం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయినా.. అభిషేక్‌లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మోసపోయానని విరక్తి చెందిన శ్వేత.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే రోజు పోస్టుమార్టం చేసి, అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. ఆ తర్వాత అల్లుని అక్రమ సంబంధం గురించి అత్తమామలకు తెలియడంతో.. అతనితో పాటు కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.