Tragedy : అమెరికాలో జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నివాసులు తల్లి, కుమార్తె మృతి చెందారు. ఈ విషాద వార్తతో మంచిర్యాల పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది.వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల రెడ్డి కాలనీలో నివసించే విశ్రాంత సింగరేణి కార్మికుడు పి.విఘ్నేష్ కుటుంబం అమెరికాలో నివసిస్తోంది. విఘ్నేష్ దంపతులకు స్రవంతి, తేజస్వి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగి, అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల తేజస్వి గృహప్రవేశం సందర్భంగా గత నెల 18న విఘ్నేష్, ఆయన భార్య రమాదేవి అమెరికా వెళ్లారు.
AP Employees: డీఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ ఉద్యోగుల రియాక్షన్!
శుక్రవారం పెద్ద కుమార్తె కుమారుడు నిశాంత్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న కుటుంబం, శనివారం ఉదయం తిరుగు ప్రయాణంలో ఘోర ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వచ్చిన టిప్పర్‌ను ఢీకొనడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రమాదేవి (55), తేజస్వి (30) ఘటనాస్థలంలోనే మృతి చెందగా, మిగతా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంచిర్యాల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Rishab Shetty : రిషబ్ శెట్టి గొప్ప మనసు.. ప్రభుత్వ స్కూళ్లకు సాయం