Man Shoots Daughter: పెళ్లికి 4 రోజుల ముందు కూతురిని కాల్చి చంపిన తండ్రి.. కారణం ఏంటంటే..
- పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతురు హత్య..
- వివాహానికి ఒప్పుకోకపోవడంతో తండ్రి చేతిలో హతమైన కూతురు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Shoots Daughter: పోలీసుల ముందే కూతురిని కాల్చి చంపిన ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో జరిగింది. సదరు యువతి పెళ్లికి నాలుగు రోజుల ముందు తండ్రి చేతిలో హతమైంది. ఆమె హత్యకు కొన్ని గంటల ముందే పంచాయతీ కూడా జరిగింది. తండ్రి నిర్ణయించిన పెళ్లిని కాదని, కూతురు వేరే వ్యక్తిని విహాహం చేసుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ హత్య జరిగింది. 20 ఏళ్ల యువతి తను గుర్జార్, తన కుటుంబం కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించింది. తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. హత్యకు పాల్పడిన యువతి తండ్రిని మహేష్ గుర్జార్‌గా గుర్తించారు. అదే రోజు తనూ గుర్జార్ తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ వీడియోపై ఆగ్రహించిన తండ్రి, దేశీయంగా తయారు చేసిన తుపాకీతో ఆమెను కాల్చి చంపాడు. ఈ హత్యకు తను కజిన్ రాహుల్ కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
Read Also: Tummala Nageswara Rao: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల సీరియస్..
ఆమె హత్యకు కొన్ని గంటల ముందు, తన కుటుంబ సభ్యులు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ.. 52 సెకన్ల వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుటుంబ సభ్యుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంది. ‘‘నేను విక్కీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మా కుటుంబం మొదట్లో అంగీకరించింది, ఆ తర్వాత నిరాకరించింది. వాళ్లు నన్ను రోజూ కొడుతూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది’’ అని పేర్కొంది.
విక్కీ అనే వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా నివాసితో, తనూ గుర్జార్ 6 ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్నాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఎస్పీ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీస్ అధికారులు ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు వారి ఇంటికి చేరుకున్నారు. విషయాన్ని పరిష్కరించడానికి కుల పంచాయతీ కూడా జరిగింది. ఈ సందర్భంలోనే తను గుర్జార్ ఇంట్లో ఉండేందుకు నిరాకరించి, ప్రభుత్వం నిర్వహించే వన్ స్టాప్ సెంటర్‌కి తీసుకెళ్లాలని అభ్యర్థించింది.
ఆ సమయంలోనే మహేష్ కూతురితో పర్సనల్‌గా మాట్లాడాలని కోరాడు. ఆమెను ఒప్పిస్తానని చెప్పాడు. ఇలా నమ్మించిన మహేష్ కూతురుని దేశవాళీ తుపాకీతో కాల్చి చంపాడు. అత్యంత దగ్గర నుంచి ఛాతీ, నుదిలిపై కాల్చడంతో అక్కడిక్కడే తనూ మరణించింది. మహేష్ బంధువులు, పోలీసులపై కూడా తుపాకీతో ఫైర్ చేస్తానని బెదిరించాడు. మహేష్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, హత్యకు సహకరించిన రాహుల్ పరారయ్యాడు. జనవరి 18న జరగాల్సిన తను వివాహానికి సన్నాహాలు జరుగుతుండగా ఈ హత్య జరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..