Man Kills Mother: భోజనం పెట్టలేదని తల్లిని చంపి చెట్టుకు ఉరేసిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Mother: మధ్యప్రదేశ్‌లో దారుణం జరగింది. కనిపెంచిన తల్లిని అత్యంత కిరాతకంగా హతమర్చాడు కన్నకొడుకు. తనకు రాత్రి భోజనం పెట్టలేదనే కోపంతో రాష్ట్రంలోని రత్నా జిల్లాలో కసాయ కొడుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. 30 ఏళ్ల వ్యక్తి తన తల్లిని కొట్టి చంపి చెట్టుకు ఉరేసినట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 30 కి.మీ దూరంలో ఉన్న శరవణ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Read Also: Hyderabad: బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీరైన భార్యను చంపిన భర్త..
Also Read
- Champapet Murder : అన్నదమ్ముల గొడవలో దారుణం.. కత్తెరతో అన్నను చంపిన తమ్ముడు.!
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
కొడుకు ఆశారాం, తన తల్లి జీవాబాయి(65)ని అర్థరాత్రి హత్య చేసినట్లు బాధితురాలి భర్త మాలియా భీల్ శరవణ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ నీలం చోఘడ్ విలేకరులకు తెలిపారు. రాత్రి భోజనం వడ్డించే విషయంలో తల్లితో కొడుకు ఆశారం గొడవపడినట్లు తేలిందని తెలిపారు. తండ్రి జోక్యం చేసుకోవడంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్ది సమయం తర్వాత మళ్లీ వచ్చి కర్రలతో కొట్టి, ఇటుకతో మోది తల్లిని హత్య చేశాడు. ఆ సమయంలో తండ్రి నిద్రిస్తున్నట్లు అధికారి తెలిపారు.
ఆ తర్వాత ఇంటి ఆవరణలో ఉన్న వేపచెట్టుకు తల్లి మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్య చేసుకుందనే కుట్రను ముందుకు తెచ్చాడు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, నిందితుడి కోసం గాలింపు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్‌పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
-
Suriya : ఒకప్పడు వరుస ప్లాప్స్.. ఇప్పుడు 3నెలల్లో రెండు బ్లాక్ బస్టర్స్
-
Gandhari: కళ్లకు గంతలతో తాప్సీ హై-ఇంటెన్సిటీ యాక్షన్.. మహాభారతం స్ఫూర్తితో వస్తున్న ‘గాంధారి’..
-
Donald Trump: ఫోటోలో మేము కోపంగా కనిపిస్తుండవచ్చు.. కానీ, మేము స్నేహితులమే.. కిమ్‌తో పాత ఫోటో షేర్ చేసిన ట్రంప్
-
Maharashtra: బాలీవుడ్ స్టార్లకు బిగ్ షాక్.. షారుఖ్, అజయ్, టైగర్ ష్రాఫ్‌లకు ఎఫ్‌డీఏ షాకాజ్ నోటీసులు
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!