ఘోరం: 6 నెలలుగా మైనర్ బాలికపై 400 మంది రేప్.. పోలీస్ తో సహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజురోజుకు మృగాళ్ల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 400 మంది.. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆరునెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా మారింది. ప్రస్తుతం బాలిక రెండు నెలల గర్భవతి. ఈ దారుణ ఘటన ప్రస్తుతం స్థానికంగా సంచలనం రేపుతోంది.
వివరాలలోకి వెళితే.. మహారాష్ట్ర బీద్ జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తల్లి రెండేళ్ల క్రితం మృతి చెందగా.. తండ్రి ఆమెను భరించలేక ఆమెకు వివాహం చేసి చేతులు దులుపుకున్నాడు. అత్తారింట్లో బాలిక ప్రత్యేక్ష నరకం చూసింది. భర్త, మామ వేధింపులు తతుకోలేక ఉద్యోగ నిమిత్తం అంబేజోగై అనే గ్రామానికి వెళ్ళింది. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని ఇద్దరు వ్యక్తులు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
అనంతరం తాము ఎవరిదగ్గరకు వెళ్లమంటే వారి దగ్గరకు వెళ్లాలని, లేకపోతే ఈ విషయం భర్తకు చెప్తానని బెదిరించి వారి స్నేహితుల వద్దకు పంపించేవారు. ఆరునెలల్లో దాదాపు 400 మంది మృగాళ్ల వద్దకు బాలికను పంపించి నరకం చూపించారు. ఇందులో ఒక బాధ్యత కల్గిన పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం గమనార్హం. ఇక వారి బాధలు తట్టుకోలేని బాలిక దైర్యం చేసి వారి వద్ద నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలిగ చూసింది. ప్రస్తుతం బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పరిరక్షిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల వివరాలను కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?