Nellore Crime: కుబేర మూవీ తరహాలో భారీ స్కామ్.. లబోదిబోమంటున్న బాధితులు..
- నెల్లూరులో కుబేరమూవీని తలపించేలా స్కామ్..
- ఎనిమిది నెలల క్రితంకేసుకు సంంధించిన విచారణ అప్‌డేట్..
- పరారీలో అసలు నిందితులు..
- అమాయకులకు బ్యాంకుల నుంచి నోటీసులు..
- పోలీసులకు 56 మంది పేర్లతో నోటీసులిచ్చిన బ్యాంక్ అధికారులు..
- తమ సిబ్బంది ప్రమేయంపై నోరు తెరవని బ్యాంక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Crime: కుబేర సినిమా చూశారుగా .. సేమ్ అచ్చం అలానే స్క్రిప్ట్‌తో కోట్ల రూపాయలు కొట్టేశారు కొందరు నిందితులు. ఫేక్ సాఫ్ట్ వేర్ కంపెనీలు పెట్టి, అందులో అమాయకులను ఉద్యోగులుగాచూపించి, వారి పేరు మీద లక్షలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు వాటికి ఈఎంఐలు చెల్లించాలంటూ .. బాధితులకు నోటీసులు వస్తున్నాయి. అంతేనా.. ఏజెంట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో తమను రక్షించాలంటూ బాధితులు.. పోలీసులను వేడుకుంటున్నారు. ఈ కేసును ముత్తుకురు పోలీసులు విచారణ చేస్తుండగా.. లోన్ చెల్లించాలని బాధితులకు నోటీసులు వస్తుండడం వారిలో ఆందోళనకు కారణమవుతోంది. డబ్బులు రికవరీ చేయడానికి చెన్నైలోని ఓ ప్రయివేటు ఏజెన్సీతో బ్యాంకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బాధితులకు నోటీసుల మీద నోటీసులు అందుతున్నాయి. అయితేపోలీసులు మాత్రం కేసు విచారణలో ఉందంటున్నారు.
Read Also: Trump-Modi: రేపటి నుంచి ట్రంప్ కొత్త సుంకం అమలు.. భారత్ స్పందన ఇదే!
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
యాక్సెస్ బ్యాంకు కుంభకోణంలో సూత్రదారులు దర్జాగా తిరుగుతూ ఉంటే.. బాధితులు లబోదిబో అంటున్నారు. ఆన్‌లైన్ లోని లొసుగులను ఆసరాగా చేసుకుని నిందితులు ఈ భారీ స్కామ్ కి పాల్పడ్డారు. వ్యక్తులకూ సంబంధం లేకుండా నేరుగా.. ఆన్‌లైన్ ద్వారా లోన్స్ ఇవ్వొచ్చని RBI తీసుకొచ్చిన పాలసీని నిందితులు పక్కాగా ఉపయోగించుకుని స్కామ్ చేశారు. జాలే వాసుదేవ నాయుడు, అల్లాభక్షు మరో ఇద్దరు కలిసి ఫేక్ సాఫ్ట్‌వేర్ కంపెనీలు సృష్టించారు. అందులో అమాయక ప్రజల్ని ఉద్యోగులుగా చూపించి.. వారి ఆధార్ కార్డులతో ఆన్‌లైన్‌లో లోన్లు తీసుకున్నారు. ఒక్కో వ్యక్తి పేరుతో 14 లక్షల నుంచి 50 లక్షలు దాకా రుణాలు తీసుకున్నారు.
Read Also: Astrology: ఆగస్టు 26, మంగళవారం దినఫలాలు
అయితే, పోలీసులకు ఫిర్యాదు చేశాం కదా.. తమకు న్యాయం జరుగుతుందని ఆశించిన బాధితులకు బ్యాంక్ అధికారులు ఝలక్ ఇచ్చారు. EMI లు చెల్లించాలంటూ నోటీసులు పంపిస్తున్నారు. తమకు ఏమాత్రమూ సంబంధం లేకుండా, తమవారి పేరుపై కోట్ల రూపాయలు కొల్లగొట్టారని అటు బ్యాంకు అధికారులుకు, ఇటు పోలీసులకు తెలిసినా.. తమకు న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. నెల్లూరు బ్యాంక్ అధికారులు 56 మంది జాబితాను పోలీసులకు ఇచ్చి వారు లోన్స్ కట్టడం లేదని పిర్యాదు చేశారు. విడవలూరుకు చెందిన చలంచర్ల లక్ష్మీనారాయణకు లోన్ రికవరీ ఏజెన్సీ నుంచి నోటీసులో వచ్చాయి. ఇప్పటి మూడు నోటీసులు జారీ చేశారు. యాక్సెస్ బ్యాంక్ లో రూ.14.90 లక్షలు రుణం తీసుకున్నారని, తిరిగి చెల్లించాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లాలో ఉండే బాధితులందరికీ ఇలాంటి నోటీసులు అందుతున్నట్లు తెలుస్తోంది. యాక్సెస్ బ్యాంక్ తన సిబ్బంది పాత్రపై ఇప్పటి వరకు నోరు మెదపడం లేదు..
తాజావార్తలు
-
Tilak Varma Century: సెంచరీతో అదరగొట్టిన తిలక్ వర్మ.. సెంచరీతో రికార్డులు బద్దలు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!