Loan App Harassment: విషాదం.. లోన్ యాప్ వేధింపులకు వ్యక్తి ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loan App Operators Harassment Drives Man To Suicide In Nijampet: లోన్ యాప్ వేధింపులకు ఇప్పటివరకూ ఎంతోమంది బలయ్యారు. ఇప్పుడు మరొక వ్యక్తి వీళ్ల టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గాంధీ నగర్‌లోని జయదీపిక కేకేఎం ఫేజ్-1 ఆరో ట్విన్ టవర్స్‌లో సిహెచ్ రాజేష్ (35) అనే వ్యక్తి తన భార్య, మూడేళ్ల పాపతో నివసిస్తున్నాడు. నెల రోజుల క్రితమే రాజేష్ బిగ్ బాస్కెట్‌లో ఉద్యోగానికి చేరాడు. ఇటీవల ఇతను లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాడు. అయితే.. సమయానికి అప్పు తీర్చకపోవడంతో, వాళ్లు వేధింపులు పెట్టడం మొదలుపెట్టారు. తనకు కొంత సమయం ఇవ్వమని వేడుకుంటున్నా.. వాళ్లు పట్టించుకోకుండా తమ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనంటూ టార్చర్ పెట్టారు.
రానురాను వాళ్ల వేధింపులు మితిమీరడంతో, మానసికంగా కుంగిపోయిన రాజేష్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన భార్య, పాపను విజయవాడలోని స్వగ్రామానికి పంపించేసి.. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఉరి వేసుకొని, సూసైడ్ చేసుకున్నాడు. స్వగ్రామంలో ఉన్న భార్య ఎంత ఫోన్ చేస్తున్నా.. రాజేష్ లిఫ్ట్ చేయకపోయేసరికి వాచ్‌మెన్‌కి ఫోన్ చేసింది. తన భర్తకి ఒక కొరియర్ వచ్చిన విషయాన్ని భర్తకు తెలియజేయమని చెప్పింది. ఆయన వెళ్లి చూడగా.. రాజేష్ ఫ్యాన్‌కి ఉరేసుకుని కనిపించాడు. దీంతో.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంట్లో మొత్తం పరిశీలించారు. అప్పుడు వాళ్లకి లోన్ యాప్ వేధింపుల వల్లే మరణించాడని తెలిసింది. సూసైడ్ చేసుకోవడానికి ముందు రాజేష్ వాళ్లు ఎంతలా బాధ పెట్టారో ఒక బోర్డుపై రాశాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
‘‘నేను లోన్ యాప్‌లో కొంత అప్పు తీసుకున్నాను. వాళ్లకు డబ్బులు కడుతున్నప్పటికీ, నన్ను రోజూ వల్గర్ బాషతో బాధపెడుతూ వచ్చారు. వాళ్ల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’’ అని రాజేష్ ఆ బోర్డుపై రాసుకొచ్చాడు. అంతేకాదు.. లోన్ యాప్ ద్వారా మోసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!