తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో అభిమానులు తొక్కిసలాటకు గురై 39 మంది మృతి చెందగా, 111 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో నెల రోజుల్లో పెళ్లి కావాల్సిన జంట చనిపోవడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల రోజుల్లో పెళ్లి .. కరూర్ తొక్కికసలాట ఘటనలో కొత్తగా పెళ్లి చేసుకోవాల్సిన జంట చనిపోవడంతతో.. మృతుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఆకాశ్ (24), గోకులశ్రీ (24) వచ్చే నెలలో వివాహంతో ఒక్కటవ్వాల్సి ఉంది. ఆకాశ్ హీరో విజయ్ అభిమాని కావడంతో .. సభకు ఆయన వస్తున్నాడని తెలుసుకుని యువతితో కలిసి అక్కడికి వెళ్లాడు. క్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరూ చనిపోయారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటుచేసుకుంది.
According to those who attended Thalapathy Vijay’s Karur rally, around 10 people fell into a septic tank pit. 🥹 The arrival of an ambulance triggered panic, and when police tried to push the crowd away, it led to the stampede.
— KARTHIK DP (@dp_karthik) September 27, 2025