సమాజంలో రోజురోజుకు కామాంధులు ఎక్కువైపోతున్నారు. ఆడవారికి ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది. ఇల్లు, స్కూల్, పోలీస్ స్టేషన్, హాస్పిటల్ కూడా వారికి రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. చివరికి కోవిడ్ టెస్టుకు వచ్చిన మహిళలను కూడా కామాంధులు వదలడంలేదు. తాజాగా ఒక ల్యాబ్ టెక్నీషియన్.. కరోనా టెస్ట్ అని చెప్పి ఒక యువతి ప్రైవేట్ భాగంలో చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ కేసులో అతనికి నాయస్థానం పదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అమరావతిలోని ఒక మాల్ లో ఒక ఉద్యోగి కి కరోనా పాజిటివ్ అని తేలడంతో యాజమాన్య మిగతా ఉద్యోగులందరికీ కరోనా టెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. మాల్‌లోని ఉద్యోగులందరూ వడ్నేరాలోని ట్రామా కేర్ సెంటర్‌లో కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ట్రామా కేర్ సెంటర్‌లో అల్కేష్ దేశ్‌ముఖ్ అనే ఒక ల్యాబ్ టెక్నీషియన్ మాల్ ఉద్యోగులందరికీ కరోనా టెస్టులు చేశాడు. అందులో ఓ యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది.. మిగతా టెస్టులకు ల్యాబ్ కి రావాలని తెలిపాడు. దీంతో భయపడిన ఆమె టెస్టులకు లోపలికి వెళ్ళింది. అక్కడ ఆల్కేష్ మీ ప్రైవేట్ పార్ట్ నుంచి స్వాబ్ సేకరించాల్సి ఉంటుందని చెప్పడంతో ఖంగుతిన్న యువతి తాను అలా చేయలేనని చెప్పింది. అయినా అతను వినకుండా కరోనా టెస్ట్ లో ఒక భాగమేనని నమ్మబతుకుతూ ఆమె ప్రైవేట్ పార్ట్ నుంచి ఒక స్వాబ్ శాంపిల్ సేకరించాడు. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ పార్ట్ లో చేయి పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు.
ఇక యువతి ఈ విషయాన్నీ తన సోదరుడికి తెలుపడంతో గుట్టు రట్టయ్యింది. ఈ విషయం తెలుసుకొని కంగుతిన్న యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి వడ్నేరా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ల్యాబ్ టెక్నీషియన్ అల్కేష్ దేశ్‌ముఖ్‌పై కేసు నమోదు చేసింది. ఇక ఇటీవల ఈ కేసును అమరావతి జిల్లా కోర్టు విచారించి నిందితుడికి . 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. జైలు శిక్షతోపాటు నిందితుడిని రూ.10,000 జరిమానా చెల్లించవలసిందిగా ఆదేశించింది.