HAWALA MONEY: కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్
- కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్
- ఫిర్యాదుతో బయటపడ్డ హవాలా నెట్‌వర్క్ బండారం
- బహదూర్‌పురకి చెందిన ఏసీ మెకానిక్ అజీముద్దీన్, ఖుష్రూ
- గోకుల్ అపార్ట్‌మెంట్‌లో పవన్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూకట్‌పల్లిలో కోటి రూపాయల లూటీ సంచలనంగా మారింది. కోటి రూపాయల నగదుతో వెళ్తున్న వ్యక్తులపై.. కారం పొడి చల్లి, కత్తులతో బెదిరించి.. నగదు దోచుకెళ్లారు దుండగులు. దోపిడి జరిగిన 7 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. కోటి రూపాయల డబ్బును సిల్లీగా కాటన్ డబ్బాలో ప్యాక్ చేసి.. బైక్‌పై ఎందుకు తీసుకెళ్తున్నారు..?? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? ఇచ్చిందెవరు.. ఇవ్వాల్సింది ఎవరికి..? అనే వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కూకట్‌పల్లి మెయిన్ రోడ్డులో కోటి రూపాయల దోపిడి జరిగింది. బైక్‌పై కోటి రూపాయలతో వెళ్తున్న వ్యక్తులపై.. రెండు బైకుల్లో వచ్చిన మరో గ్యాంగ్ ఎటాక్ చేసింది. కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. కోటి రూపాయలు దోచుకెళ్లారు. ఈ ఘటన అంతా కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే జరిగింది.
బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన డబ్బు.. హవాలా నెట్‌వర్క్‌కి చెందిన డబ్బుగా గుర్తించారు పోలీసులు. డబ్బులు తరలిస్తున్న అజీముద్దీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో హవాలా నెట్‌వర్క్ బండారం బయటపడింది. బహదూర్‌పురకి చెందిన ఏసీ మెకానిక్ అజీముద్దీన్, ఖుష్రూ.. అమీర్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారు. మార్చి 16న రాత్రి 7 గంటలకు అమీర్.. అజీముద్దీన్‌కి ఓ 10 రూపాయల నోటు ఇచ్చాడు. ఈ నోటును కూకట్‌పల్లిలోని పిల్లర్ నెంబర్ 825 వద్ద ఉన్న గోకుల్ అపార్ట్‌మెంట్‌లో పవన్ అనే వ్యక్తికి ఇవ్వాలని సూచించాడు. కూకట్‌పల్లి చేరుకున్న అజీముద్దీన్.. పవన్‌కి కాల్ చేశాడు. అపార్ట్‌మెంట్‌లో 206 ఫ్లాట్‌కి రావాలని పవన్ సూచించడంతో అక్కడికి వెళ్లారు అజీముద్దీన్, ఖుష్రూ. తమ వద్ద ఉన్న 10 రూపాయల నోటు ఇవ్వగానే చెక్ చేసుకుని.. కోటి రూపాయల డబ్బు ఉన్న కాటన్ డబ్బాను అజీముద్దీన్‌కు ఇచ్చాడు పవన్…
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
కోటి రూపాయల డబ్బు ఉన్న బాక్స్ తీసుకున్న అజీముద్దీన్… అమీర్‌కి కాల్ చేశాడు. అతను ఇబ్రహీం అనే మరో వ్యక్తికి కాల్ చేయమని చెప్పాడు. అజీముద్దీన్.. ఇబ్రహీంకి కాల్ చేయగా… పిల్లర్ నెంబర్ 848 దగ్గరకు రమ్మని చెప్పాడు. ఖుష్రూ బైక్ నడుపుతుండగా.. అజీముద్దీన్ డబ్బు ఉన్న బాక్స్ పట్టుకుని వెనక కూర్చున్నాడు. పిల్లర్ నెం. 836 దగ్గరకు రాగానే రెండు బైకుల్లో వచ్చిన వ్యక్తులు అజీముద్దీన్‌పై కారం పొడి చల్లారు. బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోగానే… కత్తులతో బెదిరించి డబ్బు దోచుకెళ్లారు…
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అజీముద్దీన్, ఖుష్రూలకు వైద్యం చేయించి.. పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వీళ్ల నుంచి వివరాలు సేకరించారు. దోపిడీ జరిగిన ప్రదేశంలో.. డబ్బులు కలెక్ట్ చేసుకున్న ఫ్లాట్ వద్ద నుంచి CC ఫుటేజ్ సేకరించారు. దుండగుల కోసం 4 ప్రత్యేక టీమ్స్‌తో గాలించారు. తెల్లవారుజామున 5 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లక్నోకి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. ముగ్గురు దుండగులను పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
హవాలా రూపంలో డబ్బులు ఇచ్చిన పవన్ ఎవరు..? ఎంత కాలంగా ఈ దందా నడిపిస్తున్నారు. పవన్ వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..? పవన్ ఎవరికి డబ్బులు చేరవేస్తున్నాడు..? అనే వివరాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే.. అపార్ట్‌మెంట్‌లో C tech Finserv సొల్యూషన్స్ పేరుతో పవన్ నిర్వహిస్తున్న సంస్థ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులకు.. హవాలా రూపంలో డబ్బులు తరలిస్తున్న వ్యక్తులకు మధ్య ఉన్న లింకులపై కూడా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!