Kongara Kalan Pallavi Parents Claims That Her Daughter Killed By Someone: ప్రియుడి వేధింపులు భరించలేక.. పల్లవి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే! అయితే.. తమ అమ్మాయిది ఆత్మహత్య కాదని, ఎవరో హత్య చేశారని పల్లవి తల్లిదండ్రులు ఆంగోతు సరిత, అంతరామ్ ఆరోపిస్తున్నారు. ఎవరో తమ పల్లవిని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వాపోయారు. తమ అమ్మాయి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. వండర్‌లా రిసార్ట్‌లో పల్లవి పని చేస్తుందని, అందులోనే తమ అమ్మాయిని వేధించారని పేరెంట్స్ పేర్కొంటున్నారు. వేధింపుల సంగతి ఇప్పటివరకూ పల్లవి తమకు చెప్పలేదని తెలిపారు. ఆరోజు తమ అమ్మాయికి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో తాము ఫోన్ చేశామని, అయితే ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో భయాందోళనకు గురయ్యామని, వెంటనే ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే, తమ అమ్మాయి బ్రతికేదని భావోద్వేగానిక లోనయ్యారు. ఆదిభట్ల పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారన్నారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పోలీసులను వేడుకున్నారు. తమ అమ్మాయిని వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Rohit Sharma: రోహిత్ శర్మ మరో మైలురాయి.. 6వ బ్యాటర్‌గా రికార్డ్
కాగా.. కొంగరకలాన్ తండాకు చెందిన ఆంగోతు సరిత, అంతిరామ్ దంపతుల కుమార్తె అయిన పల్లవి (21) వండర్‌లాలో ఉద్యోగం చేస్తుంది. రెండేళ్ల క్రితం పల్లవికి హైదరాబాద్ మూసాపేటకు చెందిన క్రాంతి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. రోజులు గడిచేకొద్ది ఈ పరిచయం ప్రేమగా మారింది. మరోవైపు.. వండర్‌లాలో తనతోపాటు పని చేస్తున్న ప్రణయ్ అనే వ్యక్తితోనూ పల్లవికి పరిచయం ఉంది. అయితే.. ప్రణయ్‌తో పల్లవి చనువుగా ఉంటోందని, తరచూ చాటింగ్ చేస్తోందని క్రాంతి అనుమానించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య గత రెండు నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. గురువారం కలుసుకున్నప్పుడు.. ‘నీ బాగోతం నాకు తెలుసు, నీ విషయం అందరికీ చెప్తా’ అంటూ క్రాంతి బెదిరించాడు. అతని మాటలతో మనస్థాపం చెందిన పల్లవి.. ‘ఐ లవ్ యు, లాస్ట్ మెసేజ్’ అంటూ వాట్సాప్‌లో మెసేజ్ చేసింది. అనంతరం ఊరి చివరికి వెళ్లి, చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో, పోలీసులు రంగంలోకి దిగి, సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పల్లవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. ఇదే లాస్ట్ మెసేజ్ అంటూ పల్లవి నుంచి తనకు మెసేజ్ రావడంతో క్రాంతికి అనుమానం వచ్చింది. దాంతో వెంటనే అతడు ఆదిభట్ల పోలీసులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత
పల్లవి ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. వారు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు వచ్చిన అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు.. అర్థరాత్రి రెండు గంటల వరకు పల్లవి కోసం గాలించారు. కానీ, ఎక్కడా ఆచూకీ లభ్యం కాలేదు. ఇంతలోనే శుక్రవారం పల్లవి చెట్టుకి ఉరివేసుకుని కనిపించింది. కూతురి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. అటు.. పల్లవి ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు క్రాంతి, ప్రణయ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పల్లవిది ఆత్మహత్యేనా? లేక హత్యనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.