ఖమ్మం జిల్లా నడిబొట్టున దాదాపు 200 కోట్ల పైచిలుకు వివాదంలో చిలికి చిలికి గాలి వానగా మారుతుంది .ఈ వివాదంలో పోలీసులు ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వివాదం చల్లారటం లేదు. అన్నదమ్ముల మధ్య ఉన్న వివాదంలో వాటాల పంపిణీలో ప్రముఖ నేతలు జోక్యం చేసుకున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కరించటం పోలీసులకి ఇబ్బందికరంగా మారింది. గత 40 రోజుల నుంచి ఈ వివాదం కొనసాగుతుంది. నగరంలోని ప్రముఖ ఏరియా అయిన వీడియోస్ కాలనీలో జరుగుతున్న ఘటనలు రోజురోజుకీ ఉద్రిక్తకంగా మారుతున్నాయి.
గత రాత్రి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కార్పొరేటర్ భర్త మిక్కిలినేని నరేందర్ ని మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక నాయకుడు నిన్న బెదిరించటంతో వివాదం పెరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం కూడా అదే ఏరియా కార్పోరేటర్ మంజుల భర్త కాంగ్రెస్ నాయకుడు నరేందర్ ని పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే సమయంలో అన్నదమ్ములలో ఒక్కరికి మద్దతుగా మహబూబాబాద్ ఏరియా నుంచి వచ్చిన తాళ్లూరి గంగాధర్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ కు చెందిన వ్యక్తిని తీవ్రంగా కొట్టిన ఘటన జరిగింది.
కొట్టిన విజువల్స్ సీసీ కెమెరాలు నమోదు అయ్యాయి.. దెబ్బలు తిన్న వ్యక్తి ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ గా గుర్తించారు. ఈ సందర్భంగా అల్లంత దూరాన ఉన్న పోలీసులు అక్కడికి వచ్చి కొడుతున్న వ్యక్తుల పై లాఠీలు జరిపించారు. అయితే పోలీసుల ను కూడా లెక్క చేయకుండా పోలీసుల మీద కూడా విరుచుకుపడేందుకు ఆ వర్గం వారు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు లాటీలు జులిపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం నగరంలో కీలకమైన ప్రదేశము లో ఉన్న వీడియోస్ కాలనీలో గత 40 రోజులుగా బయట వ్యక్తుల రాజ్యం కొనసాగుతుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. శాంతి భద్రతల సమస్య కూడా ఇక్కడ ఉత్పన్నమైంది.