బ్రిటన్ లోని ట్రోబ్రిడ్జ్కు చెందిన 52 ఏళ్ల జాన్ స్ట్రెంబ్రిడ్జ్ గత సంవత్సరం నేషనల్ లాటరీస్ సెట్ ఫర్ లైఫ్ నుండి లాటరీ టికెట్ కొనుగోలు చేసినప్పుడు, అతను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. డిప్పర్ అని పిలువబడే స్థానిక ఓ పక్షితో విజయవంతంగా ఫోటో షూట్ చేసిన తరువాత, జాన్ లాటరీ టికెట్ తీసుకోవడానికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దుకాణం వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాడు. తాను గెలుస్తానని అనుకోని జాన్, గ్లౌసెస్టర్షైర్ లోని స్ట్రౌడ్లోని సమీప…
Lottery Ticket: లాటరీ టికెట్లు అంటే ఇండియాలో ముందుగా గుర్తుకువచ్చేది కేరళ రాష్ట్రమే. ఆ రాష్ట్రంలో లాటరీ టికెట్ల బిజినెస్ చాలా బాగా నడుస్తుంది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంటుంది. కేరళ లాటరీలు అక్కడి సాధారణ ప్రజల్ని కూడా కోటీశ్వరులను చేసిన సంఘటను ఉన్నాయి. అయితే కొన్ని సార్లు ఈ లాటరీ టికెట్లే హత్యలకు దారి తీస్తున్నాయి. కుటుంబాల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి.
Dubai Lottery ticket: లక్ష్మీ దేవి ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో ఎవరికీ తెలియదు. అయితే కొట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి లేకపోతే కష్టం. అలాగే జరిగింది ఓ వ్యక్తికి. దుబాయ్ లో లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొంటూ ఉంటారు మన భారతీయులు. ఎక్కువగా మనవారికే లాటరీలు తగులుతూ ఉంటాయి కూడా. ఇలా సరదాగా కొన్న ఓ లాటరీ టికెడ్ మన భారతీయుడు ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ…
Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలో ఓనం పండగ సందర్భంగా తిరువోణం బంపర్ లాటరీని నిర్వహించారు. ఈ లాటరీలో తిరువనంతపురంలోని 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ బహుమతుల విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టికెట్…