Karnataka Man Kills Delivery Agent While Receiving iPhone: ఐఫోన్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి? కాకపోతే అది చాలా ఖరీదైంది కాబట్టి, మధ్య తరగతి వాళ్లు కొనలేరు. అందుకే.. తమ ఇష్టాన్ని చంపుకొని, సాధారణ ఫోన్లతోనే సర్దుబాటు చేసుకుంటారు. కానీ.. కొందరు మాత్రం ఎలాగైనా ఐఫోన్ కొనాలన్నా ఉద్దేశంతో, తప్పుడు మార్గాల్ని అనుసరిస్తుంటారు. అంటే.. అడ్డదారిలో డబ్బులు దోచుకోవడమో, నేరుగా ఐఫోన్‌లనే దొంగతనం చేయడమో లాంటివి చేస్తుంటారు. అయితే.. ఓ కుర్రాడు అంతకుమించి కిరాతకానికి పాల్పడ్డాడు. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలనే బలి తీసుకున్నాడు. కర్ణాటకలో చోటు చేసుకున్న ఈ షాకింగ్ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Morbi Bridge Collapse: మోర్బీ వంతెన ఘటన.. వెలుగులోకి సంచలన విషయాలు
కర్ణాటకలోని హసన్ జిల్లాకు చెందిన హేమంత్ దత్ (20) అనే ఓ యువకుడికి ఐఫోన్ అంటే ఎంతో ఇష్టం. కాదు కాదు.. పిచ్చి. కానీ, అది కొనేంత స్థోమత అతనికి లేదు. దీంతో.. అతడు ఓ దుర్మార్గపు వ్యూహం పన్నాడు. తన వద్ద డబ్బులు లేకపోయినా.. ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ-కార్ట్ డెలివరీ ఏజెంట్ హేమంత్ నాయక్ ఆ ఫోన్‌ను డెలివరీ చేయడానికి దత్ ఇంటికి వెళ్లాడు. నాయక్‌ను లోపలికి పిలిచిన దత్.. వెంటనే కత్తి తీసుకుని, అతడు చనిపోయేదాకా పొడిచాడు. అనంతరం మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. సరైన సమయం కోసం వేచి చూసిన దత్.. ఓ స్కూటీలో నాయక్ మృతదేహాన్ని వేసుకొని, ఓ రైల్వే ట్రాక్ వద్ద పడేశాడు. అక్కడ ఆ బాడీని పెట్రోల్‌తో కాల్చేయడానికి ప్రయత్నించాడు.
Ghost Video: నడిరోడ్డుపై దెయ్యం.. చితకబాదిన బైకర్.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
మరోవైపు.. హేమంత్ కనిపించకపోవడంతో అతని సోదరుడు మంజూ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. చివరికి నిందితుడు హేమంత్ దత్‌ని పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో హేమంత్ నాయక్ మృతదేమాన్ని స్కూటీలో దత్ తరలించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రెండు రోజుల క్రితం ఒక పెట్రోల్ పంప్‌లో బాటిల్‌లో పెట్రోల్ కొన్నాడన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఐఫోన్ చాలా ఖరీదైందే కానీ, మరీ ఒక వ్యక్తి ప్రాణాలు తీసేంత కాదు.