Indore: పెళ్లి చేసుకుంటానని విడాకులు తీసుకున్న మహిళపై అత్యాచారం..
- పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం..
- విడాకులు తీసుకున్న మహిళని మోసం చేసిన నిందితుడు..
- నిందితుడికి పెళ్లయి అప్పటికే నలుగురు పిల్లలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్‌లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.
ఈ కేసులో నోయిడాకు చెందిన మహ్మద్ అకీల్ అనే నిందితుడిపై మహిళ ఫిర్యాదు చేసింది. నిందితుడు తాను సింగిల్ అని చెబుతూ, మహిళతో స్నేహం చేశాడు. అనంతరం ఇండోర్ వచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు.నిందితుడు మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి వారం రోజుల క్రితం ఢిల్లీకి తీసుకెళ్లినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. అయితే, ఢిల్లీలో ఉన్నప్పుడు నిందితుడికి అప్పటికే పెళ్లయి నలుగురు పిల్లలు ఉన్నట్లు, తాను పెళ్లి చేసుకోలేనని మహిళతో చెప్పాడు.
Also Read
- Kurnool Intiyaz M*ur*der Case: కర్నూలు టీడీపీ కార్యకర్త హత్యలో ట్విస్ట్.. ఇంతియాజ్ చివరి వీడియో వైరల్
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- Chamoli Tunnel Accident: చమోలీ సొరంగం ప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
తాను విడాకులు తీసుకున్నట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తనకు మహ్మద్ అఖిల్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడినట్లు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు నెలల క్రితం, ఆమె కేదార్‌నాథ్ పర్యటన నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో అఖిల్‌ని కలిసింది. అఖిల్ ఇండోర్ వచ్చి తనతో రిలేషన్‌షిప్ ఏర్పాటు చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. తనను పెళ్లి చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్దామని అతను తనకు చెప్పినట్లు తెలిపింది. ఆగస్టు 13న ఇద్దరు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా నిందితుడు సదరు మహిళతో సంబంధాన్ని కొనసాగించాడు.
ఇదిలా ఉండగా, తనకు అప్పటికే వివాహమైనట్లు చెప్పాడని మహిళ పేర్కొంది. తన భార్య ఉత్తర్‌ప్రదేశ్‌లో నివసిస్తుందని, తనకు నలుగురు పిల్లలు ఉన్నట్లు చెప్పాడని చెప్పినట్లు మహిళ వెల్లడించింది. దీని తర్వాత మహిళ ఇండోర్ తిరిగి వచ్చింది. ఈ ఘటనను రైట్ వింగ్ కార్యకర్తలకు చెప్పడంతో వారు అఖిల్‌ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
తాజావార్తలు
-
AP Dwakra Women: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.3 లక్షల రుణం, సబ్సిడీ కూడా!
-
LIC Investment: ఎల్ఐసీ మీ పాలసీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతుంది? నష్టాలను ఎలా ఎదుర్కొంటుంది? పూర్తి వివరాలు
-
Census 2027: జనాభా లెక్కల్లో తొలిసారి కులగణన.. 40 ప్రశ్నలను నోటిఫై చేసిన కేంద్రం
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!
-
Supreme Court: “ఆంక్షలు విధించడానికి మీరెవరు?”.. నల్సార్ లా వర్సిటీ అంశంలో BCIకి సుప్రీంకోర్టు చురకలు..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: చెన్నై, కోల్‌కతా కాదు.. హార్దిక్ ఆ జట్టులోకే వెళ్తాడు.. ఏ తప్పేముంది!
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!