Indore: దేశంలో ప్రతీ రోజూ ఎక్కడో చోట మహిళపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వరకు మహిళలపై అత్యాచారాలు దగ్గరి వ్యక్తులు, తెలిసిన వ్యక్తుల నుంచే ఎదురవుతున్నాయి. తాజాగా ఇండోర్‌లో ఓ వ్యక్తి మహిళను నమ్మించి అత్యాచారానికి ఒడిగట్టాడు. విడాకులు తీసుకున్న మహిళని పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తికి అప్పటికే పెళ్లైనప్పటికీ, తాను సింగిల్ అని చెబుతూ నమ్మిస్తూ వచ్చాడు.