Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Illegal Affair Wife Murder Husband Medipally

Illegal Affair : సినిమా ఫక్కీలో భర్తను చంపిన భార్య.

Published Date :December 22, 2025 , 6:50 pm
By Gogikar Sai Krishna
  • వివాహేతర సంబంధమే హత్యకు కారణం
  • ప్రియుడితో కలిసి భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య
  • హార్ట్ స్ట్రోక్ డ్రామా.. పోస్టుమార్టంతో బట్టబయలు
  • పది రోజులు నటన.. షాపింగ్‌కి వెళ్లిన నిందితురాలు
Illegal Affair : సినిమా ఫక్కీలో భర్తను చంపిన భార్య.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Illegal Affair : వివాహేతర సంబంధం ఒక పచ్చని సంసారంలో చిచ్చు పెట్టడమే కాకుండా, కట్టుకున్న భర్త ప్రాణాలను బలిగొనేలా చేసింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అశోక్ హత్య కేసులో పోలీసులు విచారణ చేపట్టగా దిగ్భ్రాంతికి గురిచేసే నిజాలు బయటపడ్డాయి. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భార్య పూర్ణిమ, తన ప్రియుడు మహేష్‌తో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసింది.

పోలీసుల కథనం ప్రకారం.. అశోక్, పూర్ణిమ దంపతులకు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, వీరి ఇంటి పక్కనే అద్దెకు ఉండే 25 ఏళ్ల యువకుడు మహేష్‌తో పూర్ణిమకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్త అశోక్‌కు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. తన తీరు మార్చుకోవాలని అశోక్ భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీనిని మనసులో పెట్టుకున్న పూర్ణిమ, తన ప్రియుడితో కలిసి భర్తను వదిలించుకోవాలని పథకం రచించింది.

Also Read

  • Love Marriage: ప్రేమ, పెళ్లి, వేధింపులు.. చివరకు బిడ్డ మృతి.. బాధితురాలి ఆవేదన వర్ణనాతీతం..
  • Crime: కొడుకు ప్రేమకు తండ్రికి శిక్ష.. కొట్టి మూత్రం తాగించి దారుణం..
  • Shocking: జిమ్‌కు వెళ్తుందని భార్య దారుణహత్య..
  • IRS Officer Daughter Murder: రాహుల్ మీనా ఎంత నీచుడంటే.. కుట్ర పన్ని, స్నేహితుడి భార్యపై అత్యాచారం..

పథకం ప్రకారం.. పూర్ణిమ, మహేష్ కలిసి అశోక్‌పై దాడి చేశారు. అనంతరం మూడు చున్నీలను అశోక్ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. హాల్‌లో హత్య చేసిన తర్వాత, ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని పై అంతస్తులోని బెడ్ రూమ్‌కు చేర్చారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా అశోక్ సోదరికి ఫోన్ చేసి, అశోక్‌కు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, స్పృహ లేకుండా పడిపోయాడని నమ్మబలికారు.

Sridhar Babu : మేము ‘హైప్’ చేయడం లేదు.. నిరుద్యోగుల్లో ‘హోప్’ క్రియేట్ చేస్తున్నాం

అశోక్ సోదరి వచ్చి చూసేసరికి అశోక్ అచేతనంగా పడి ఉన్నాడు. ఒంటిపై గాయాలు ఉండటంతో ఆమె ప్రశ్నించగా, బాత్‌రూమ్‌లో కింద పడటం వల్ల ఆ దెబ్బలు తగిలాయని పూర్ణిమ అబద్ధం చెప్పింది. మృతదేహానికి పోస్టుమార్టం జరగకుండా ఉండేందుకు పూర్ణిమ, మహేష్ గట్టిగా ప్రయత్నించారు. ఆసుపత్రి వద్దకు మహేష్ కూడా వచ్చి పోస్టుమార్టం అవసరం లేదని కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేశాడు.

వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టం రిపోర్టులో అది ‘హత్య’ అని తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అనుమానంతో భార్య పూర్ణిమను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. మహేష్‌తో కలిసి తానే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, అశోక్ చనిపోయిన పది రోజుల పాటు పూర్ణిమ ఇంట్లో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ దశదిన కర్మలు నిర్వహించింది. ఈ పది రోజుల్లోనూ ఆమె రహస్యంగా తన ప్రియుడు మహేష్‌తో చాటింగ్ చేయడమే కాకుండా, మూడు రోజుల క్రితం అతనితో కలిసి షాపింగ్‌కు కూడా వెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

New Income Tax Rules: ఇకపై డిజిటల్ ఖాతాలను వదలబోనంటున్న ఐటీ శాఖ.. అతి త్వరలో సరికొత్త రూల్స్ అమల్లోకి..!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • extra marital affair
  • hyderabad crime
  • illegal affair
  • Medipally Murder Case
  • wife kills Husband

తాజావార్తలు

  • Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!

  • IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..

  • Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!

  • Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు

  • TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions