దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని సరూర్ నగర్ కట్టపై క్రేన్ అమాంతం గాల్లోకి లేచి పల్టీ కొట్టింది. దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also:Singapore: ఎరక్క పోయి.. ఇరుక్కు పోయారు.. సె*క్స్ వర్కర్లపై దాడి.. ఇండియన్స్ అరెస్ట్
అనుభవం లేని సర్వేస్ కు టెంటర్ అప్పగించడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. గత వినాయక నిమజ్జనంలో కూడా ఇదే కంపెనీ కి చెందిన క్రేన్ కు ప్రమాదం జరిగింది. క్రేన్ అమాంతం.. గాల్లోకి లేచి చెరువులో పడింది.. రోడ్డుపై పడితే ఎంత ప్రాణ నష్టం జరిగి ఉండేదని.. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ.. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Read Also:Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య
అనుభవం లేని మెయింటెనెన్స్ కూడా లేని సిటీ క్రేన్ సర్వీసెస్ కు కాంట్రాక్ట్ అప్పగించి చేతులు దులిపేసుకన్నారు జీహెచ్ ఎంసీ అధికారులు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోవటంతో డ్రైవర్ తప్పా.. క్రేన్ లో ఏదైనా సాంకేతిక కారణం ఉందా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.