Golconda : గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం… టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న స్థావరంపై హైదరాబాద్ కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్), స్థానిక గోల్కొండ పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహిళా నిర్వాహకురాళ్లతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకోగా, ఓ బాధితురాలికి పోలీసులు విముక్తి కల్పించారు.
డబ్బు ఆశ చూపి ఉచ్చులోకి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండ మహమ్మద్ నగర్, కటోరా హౌస్ ప్రాంతానికి చెందిన ఫర్హా బేగం (32), ఆరాంఘర్‌కు చెందిన ఫర్హీన్ (25) అనే ఇద్దరు మహిళలు ముఠాగా ఏర్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక మహిళలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి నగరానికి రప్పించేవారు. గోల్కొండ పరిధిలో నివాస వసతి ఏర్పాటు చేసి, విటులను ఆకర్షిస్తూ వారి ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు.
Also Read
- Gambling Raid: వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
- Wife Kills Husband : కొత్తపేటలో దారుణం... భార్య చేతిలో భర్త దారుణ హత్య!
- Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి.. ముగ్గురు అరెస్ట్
ఈ అక్రమ కార్యకలాపాలపై పక్కా సమాచారం అందుకున్న గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ బృందం, స్థానిక పోలీసులతో కలిసి సదరు అడ్డాపై ఆకస్మిక దాడి నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధాన నిర్వాహకురాలు ఫర్హా బేగం, సహ-నిర్వాహకురాలు ఫర్హీన్లతో పాటు అక్కడే ఉన్న విటుడు ఫయాజ్ ఆలం (32, వెల్డర్, కొండాపూర్ నివాసి)ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడ చిక్కుకున్న ఓ బాధితురాలిని సురక్షితంగా రక్షించి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనా స్థలం నుంచి 4 మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు.. విచారణ ముమ్మరం
ఈ ఘటనపై గోల్కొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 406/2026 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 143(2), 144(2) తో పాటు పిటా (PITA) చట్టం సెక్షన్లు 3, 4, 5 ల కింద కేసులు నమోదు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎమ్. మహేష్ పర్యవేక్షణలో ఎస్సై వి. శ్రీనివాస్, గోల్కొండ పోలీస్ సిబ్బంది, మహిళా కానిస్టేబుళ్లు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. నగరంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలు సాగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
-
Nitesh Tiwari: ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే ఆరున్నరేళ్లు.. ‘రామాయణ’ మూవీపై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Trafficking: ఫెర్టిలిటీ సెంటర్లలో త్వరలోనే తనిఖీలు.. కఠిన చర్యలకు మల్కాజ్గిరి సీపీ హెచ్చరిక..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!