Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..
- ఫిబ్రవరి 25న కారు అద్దెకు తీసుకున్న దుండగులు..
- తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ మార్పు..
- రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. అక్కడే కారు రూపు రేఖలు మార్చేశారు. తక్కువ ధరకు కారు విక్రయించేసి డబ్బులు తీసుకుని చెక్కేశారు. ఇక కారు యజమాని అడిగితే.. ట్రిప్‌లోనే ఉన్నామని బురిడీ కొట్టించిన బే’కార్’గాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు..
హైదరాబాద్‌లో కొంత మంది కేటుగాళ్లు.. జల్సాలకు అలవాటు పడి.. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నల్లకుంట నివాసి రామలింగేశ్వర కారును ఫిబ్రవరి 25న కొంత మంది దుండగులు లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. తర్వాత మిత్రులంతా కలిసి లాంగ్ డ్రైవ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అలా తీసుకు వెళ్లిన కారు.. చాలా రోజులైనా తిరిగి రాకపోవడంతో కారు యజమానికి డౌట్ కొట్టింది. దీంతో తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
Also Read:Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
కారును రాజస్థాన్‌కు తీసుకు వెళ్లిన దుండగులు.. అక్కడే ఓ స్క్రాప్ దుకాణంలో ఉన్న మరో పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ తీసి లాంగ్ డ్రైవ్‌కి తీసుకు వెళ్లిన కారుకు అమర్చారు. అంతే కాదు.. అంతా కరెక్ట్‌గా ఉందనుకున్న తర్వాత రాజస్థాన్‌లోనే కారును అమ్మేశారు. రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, బాబానగర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మహీంద్రా XUV కారుతోపాటు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!