Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్‌కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది?
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్‌కు రింకూ సింగ్ దూరం..!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
హైదరాబాద్ అంబర్ పేట్ లోని బాపూజీ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారు. మృతులను రామ్రాజ్, మాధవి, శశాంక్‌గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట్లో ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని రామ్రాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా అంబర్‌పేట్‌లోనే నివాసం ఉంటున్నారు. సొంతిల్లు.. పెద్ద భవనం.. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. కానీ ముగ్గురు సూసైడ్ చేసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
రామ్ రాజ్ ముందు భార్య మాధవిని చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామ్రాజ్ కుమారుడు శశాంక్ తన ఎడమ చేయి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతను చనిపోకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు రామ్రాజ్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆస్తులు మొత్తం తన కూతురికేనంటూ వీలునామా కూడా రాసినట్లు సమాచారం.
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
ప్రస్తుతం రామ్రాజ్ కూతురు అమూల్య కొంపల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. రామ్రాజ్ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ దిశగా కూడా విచారణ చేస్తామని చెప్పారు పోలీసులు. ల్యాండ్‌మార్క్ హోటల్ యజమాని కుటుంబం మృతిపై రామ్రాజ్ అన్న జగదీశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని, తమది వెల్ సెటిల్డ్ కుటుంబం అని చెప్పారు. తమకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు జగదీష్. నా తమ్ముడు ఫ్యామిలీ సూసైడ్ ఎందుకు చేసుకున్నారో.. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కంటతడి పెట్టారు.
మరోవైపు తెల్లవారు 3 గంటల 15 నిమిషాలకు రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్‌లో సూసైడ్ చేసుకున్నామని మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యభర్తలు ఇద్దరు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రవి. రామ్ రాజ్.. అంబర్‌పేట్‌లో ల్యాండ్ మార్క్ హోటల్, మల్లేపల్లిలో బిరియాని సెంటర్, మల్లాపూర్‌లో కింగ్స్ హోటల్, చక్రిపురంలో మరొక హోటల్ నిర్వహిస్తున్నారు. ఐతే ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపడితే చనిపోయారా? ఎవరైనా భయపెట్టారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!