Hyderabad Couple Caught Smuggling Ganja: డబ్బుకు లోకం దాసోహం అంటారు. అలాంటి డబ్బు ఎలాంటి పనులు అయినా చేయిస్తుంది. ఉద్యోగం పోయిన ఇద్దరు దంపతుల్ని గంజాయి పెడ్లర్లుగా మార్చింది. అటు గంజాయి కోసం కొంత మందిని కిడ్నాపర్లుగా మార్చింది. మొత్తంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ రెండు ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి.
READ MORE: Shocking : కేపీహెచ్‌బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి
హైదరాబాద్‌లో ఇద్దరు భార్యా భర్తలు గంజాయి పెడ్లర్లుగా పట్టుబడ్డారు. బహుశా పోలీసులకు ఇలాంటి వారిని పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఐతే ఇద్దరు భార్యభర్తలు బాగానే చదువుకున్నారు. ఉద్యోగాల్లో ఇబ్బంది రావడంతో వదిలి పెట్టేశారు. వేరే ఉద్యోగాలు వెతుక్కోవాలి. కానీ అప్పటికే గంజాయికి అలవాటు పడ్డ వారిద్దరూ.. ఓ క్రిమినల్ పథకం వేశారు. గంజాయి కొట్టేవాళ్ల డేటా ఉంది. జస్ట్ గంజాయి తీసుకు వచ్చి అమ్మితే లాభాలతోపాటు తాము కూడా గంజాయి సేవించవచ్చని ప్లాన్ రెడీ చేశారు..
తమ ప్లాన్ అమలు చేసేందుకు అంతా రెడీ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఒడిశాకు బస్సులో బయల్దేరారు. అక్కడ చెరో 10 కిలోల వరకు గంజాయి కొనుగోలు చేశారు. తిరుగు ప్రయాణంలో మాత్రం భార్య, భర్త వేర్వేరుగా బస్సులో రిటర్న్ అయ్యారు. ఇక్కడకు తీసుకు వచ్చిన గంజాయిని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ ఉద్యోగులకు అమ్మాలనేది వారి ప్లాన్. కానీ వారి ప్లాన్ MGBS బస్టాండ్‌లోనే బెడిసి కొట్టింది. సిటీలో అడుగు పెట్టిన భర్తను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా బైక్ వదిలేసి పారిపోయేందుకు రెడీ అయ్యాడు. కానీ పోలీసులు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతన్ని విచారించగా.. భార్య విషయం కూడా బయట పెట్టాడు. దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. మొత్తంగా వారిద్దరి దగ్గర నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లావిష్ లైఫ్ కోసమే గంజాయి పెడ్లర్లుగా మారినట్లు విచారణలో వారు చెప్పుకొచ్చారు.
మరోవైపు సిటీలో గంజాయి బ్యాచ్‌లు అరాచకం సృష్టిస్తున్నాయి. గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక.. మరోవైపు గంజాయి దొరకకపోవడంతో పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు. అంతే కాదు ఏకంగా రోడ్ల మీదకు వచ్చి కిడ్నాప్‌లు చేస్తున్నారు. ఇలాగే ఓ ఆటో డ్రైవర్‌ను గంజాయి బ్యాచ్ కిడ్నాప్ చేసింది. అతన్ని బండ్లగూడలో కిడ్నాప్ చేసి.. అదే ఆటోలో సిటీలోని చాలా ప్రాంతాలు తిప్పారు. డబ్బులు కావాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో మరింత రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. చివరికి డబ్బులు కావాలని చెప్పి ఆటో డ్రైవర్ భార్యకు ఫోన్ చేసి తీసుకున్నారు. ఆ తర్వాత ఆటో డ్రైవర్ని వదిలిపెట్టారు. ఆటో డ్రైవర్ నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయికి డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ చేసినట్లు వారు ఒప్పుకున్నారు. గతంలో ఓ హత్య కేసులో వారు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. మొత్తంగా హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. గంజాయి పెడ్లర్లను, కన్జూమర్స్‌ను కట్టడి చేయాలని సిటీ జనం కోరుతున్నారు..
READ MORE: Modi Wang Yi meeting: ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ.. కీలకమైన విషయాలపై చర్చ