Modi Wang Yi meeting: ప్రధాని మోడీతో చైనా విదేశాంగ మంత్రి భేటీ.. కీలకమైన విషయాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Modi Wang Yi meeting: భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. భారత్, చైనా మధ్య సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయని తెలిపారు. ఈసందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. “వాంగ్ యీని కలవడం ఆనందంగా ఉంది. గతేడాది కజాన్లో జిన్పింగ్‌తో సమావేశమైనప్పటి నుంచి.. ఇరుదేశాల సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధించాయి. సున్నిత అంశాలను గౌరవించడం, పరస్పర ప్రయోజనాల ద్వారా ఇది సాధ్యమైంది. చైనాలోని టియాంజిన్లో నిర్వహించనున్న ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు సమయంలో జిన్పింగ్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నాను. భారత్, చైనాల మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు.. ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడతాయి” అని పేర్కొన్నారు.
READ MORE: Mumbai : భారీ వర్షంతో మార్గం మధ్యలో ఆగిపోయిన మోనో రైలు
Also Read
ప్రధాని మోడీ తన వ్యాఖ్యలలో టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశాన్ని ప్రస్తావించారు. SCO అనేది ఇండియా – చైనా రెండూ క్రియాశీల సభ్యులుగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రాంతీయ వేదిక. దీని ద్వారా రెండు దేశాలు ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, ఉగ్రవాదంపై పోరాటం వంటి అంశాలపై కలిసి పనిచేస్తాయి. చైనాలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో జరిగే ఎస్సీవో సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతున్నారని అజిత్ డొబాల్ అధికారికంగా ప్రకటించారు.
తూర్పు లడఖ్‌లో సరిహద్దు వివాదం తర్వాత భారతదేశం – చైనా మధ్య సంబంధాలు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరుదేశాలు చర్యలు తీసుకున్నారు. ఈక్రమంలో రెండు దేశాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాయి. గత సంవత్సరం కజాన్‌లో జరిగిన సమావేశం, ఆ తర్వాత జరిగిన దౌత్య చర్చలు రెండు దేశాల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయి.
READ MORE: Arjun Chakravarthy : నల్గొండ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య కథే ‘అర్జున్ చక్రవర్తి’
తాజావార్తలు
-
Adilabad Airport: ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులో కీలక ముందడుగు.. పనులు ఇక మిషన్ మోడ్‌లో
-
BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
-
UIDAI App: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంట్లో కూర్చునే నిమిషాల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు! ఓ లుక్ వేయండి..
-
Su-57E Stealth Fighter: భారత్‌కు రష్యా Su-57E ఎందుకు అవసరం.? చైనా, పాక్‌కు చెక్..
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!