Hyderabad: గరంగరం సమోసాలు.. ఇవి తింటే రోగాలు ఫ్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: గరంగరం సమోసాలు చూస్తేనే కొందరి నోళ్లూరుతుంటాయి…!! లొట్టలేసుకుని మరీ తింటుంటారు.. !! కొందరు ఏకంగా ఐదారు సమోసాలు కూడా లాగించేస్తుంటారు. కుల్సుంపురలో సమోసాల తయారీని ఓసారి చూశారంటే.. జీవితంలో మళ్లీ సమోసా ముట్టరు. కల్తీ నూనే… ముక్కిపోయిన పిండి… అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తున్నారు. వీటిని నగరంలోని బడా బేకరీలు, హోటళ్లు, టీస్టాల్స్, కెఫేలకు సప్లై చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీతో అసలు బండారం బయటపడింది. అబ్దుల్ అనే వ్యాపారి కొందరు వర్కర్లను నియమించుకుని సమోసాలు, ఎగ్ పఫ్‌లు, వెజ్ పఫ్‌లు తయారు చేస్తున్నాడు. ఉడకబెట్టిన ఎగ్స్‌ను వారం రోజులపాటు ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి వాటితో ఎగ్‌పఫ్‌లు తయారు చేస్తున్నారు. కుళ్లిపోయిన ఆలు, ఇతర కూరగాయలతో వెజ్ పఫ్‌లను చేస్తున్నారు. వీటి కోసం వాడుతున్న ఆయిల్ కూడా కల్తీదే అని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కాలం చెల్లిన పిండితో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. వీటిని హోల్ సేల్ పేరుతో… నగరంలోని పెద్దపెద్ద బేకరీలు, టీస్టాల్స్, హోటళ్లు, కెఫేలకు సప్లై చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు… టాస్క్‌ఫోర్స్ పోలీసులతో కలిసి ఈ తయారీ గోదాంపై దాడి చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తయారీదారుడు అబ్దుల్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సమోసాలు తింటే రోగాలు రావడం పక్కా.
READ MORE: Theft Gangs: సినీ స్టైల్ చోరీలు.. పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠాలు..
Also Read
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!