HYD PUJARIKI JAIL: జైల్లో పూజారి..
- మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు
- నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD PUJARIKI JAIL: చేసేది గుళ్లో పౌరోహిత్యం.. కానీ ఆ పూజారి కాస్తా.. బంగారం కోసం వైల్డ్ క్రిమినల్‌గా మారాడు. ఒంటరిగా గుడికి వచ్చిన వృద్ధ మహిళను టార్గెట్ చేసుకున్నాడు. అత్యంత దారుణంగా ఆమెను గుళ్లోనే హతమార్చాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు దోచుకున్నాడు. సీన్ కట్ చేస్తే పోలీసులకు చిక్కాడు. కోర్టులో హజరుపరచడంతో అతనికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.2022లో మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో జరిగిన మహిళ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితునికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది.
Read Also: Vijay – Rashmika: పాపం.. పెళ్లి కూడా ప్రశాంతంగా చేసుకోనివర్రా..
Also Read
- Tamil Nadu: పందెంకోడి మిస్సింగ్.. వాట్సాప్‌లో ఆరా.. యువకుల మధ్య తీవ్ర ఘర్షణ
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా పామురు మండలం బాలసుబ్బయ్యనగర్‌కు చెందిన అనుమాల మురళీకృష్ణ అలియాస్ కిట్టు మల్కాజిగిరిలోని విష్ణుపురిలో నివాసం ఉంటూ స్థానిక స్వయంభూ సిద్ధివినాయక గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. పేరుకు పూజారే అయినప్పటికీ అతడు చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలయ్యాడు. విష్ణుపురి ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్న గోర్తి వెంకట నారాయణ మూర్తి భార్య ఉమాదేవి రోజూ గుడికి వచ్చేది. దీంతో ఆమెతో కాస్త పరిచయం పెంచుకున్నాడు మురళీ కృష్ణ. కానీ అతని ఆలోచన అంతా ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగల మీదే ఉండేది. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై అతని కన్నుపడింది. వాటిని దొచుకునేందుకు అవకాశం కోసం వేచి చూశాడు మురళీకృష్ణ. అదే ఏడాది ఏప్రిల్ 18న రాత్రి 7.30కు ఆలయానికి వచ్చిన ఆమెను గర్భగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోమని చెప్పాడు. ఆ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఉమాదేవిపై ఐరన్ రాడ్డుతో బలంగా కొట్టాడు. తలపై గట్టిగా మోది హత్య చేశాడు. ఉమాదేవి ఒంటిపై ఉన్న నగలను కాజే శాడు.
ఆ తర్వాత డెడ్ బాడీని మాయం చేయడానికి భారీ స్కెచ్ వేశాడు పూజారి మురళీ కృష్ణ. మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి గర్భగుడిలో దాచి మూడు రోజుల పాటు గుడికి తాళాలు వేసి శుభ్రం చేశాడు. అప్పటికే మృతురాలి భర్త ఫిర్యా దుతో మల్కాజిగిరి ఠాణాలో మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు గాలించారు. మరోవైపు డెడ్ బాడీ కారణంగా.. గుడిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో మృతదేహాన్ని పూజారి గుడి వెనుక గల చెట్ల పొదల్లో పారేశాడు. మృతురాలి చెప్పులు గుడి బయట లభించడం, పూజారి పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో నగల కోసమే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పోలీసులు.. మురళీకృష్ణపై నేరాభియోగ పత్రాన్ని సమర్పించారు. బాధితురాలి తరఫున అడిషనల్ పీపీ ఎస్.కోమలత వాదనలు వినిపించారు. కేసును విచారించిన మల్కాజిగిరి కోర్టు 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి డి.కిరణ్ కుమార్ మురళీకృష్ణకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.7,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!