Ketan Agarwal Case: అమ్మో ‘సియా’.. సోనమ్ కంటే జిత్తులమారి.. నవ్వుతో చక్కబెట్టేసింది
- కేతన్ అగర్వాల్ కేసులో సంచలన విషయాలు
- తవ్వేకొద్దీ వస్తున్న సియా గోయల్ ఆగడాలు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘‘ఏడ్చే మగాడిని.. నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు.’’ అంటారు పెద్దలు. ఈ సామెత అచ్చు గుద్దినట్లుగా సియా గోయల్‌కు సరిపోతుంది. సోనమ్ రఘువంశీనే కంత్రీ అనుకుంటే.. ఆమె కంటే తాతలా ఉంది సియా గోయల్. నవ్వుతోనే అంతా చక్కబెట్టేసింది. అమాయకుడైన కేతన్ అగర్వాల్‌ను తడిగుడ్డతో గొంతుకోసేసింది. తవ్వేకొద్దీ సియా గోయల్ బండారం బయటకొస్తున్నాయి. తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read
- Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
ప్రస్తుతం ఓ కారు వీడియో వైరల్ అవుతోంది. అందులో సియా గోయల్-కేతన్ అగర్వాల్ చాలా ఉల్లాసంగా కనిపించారు. సియాకు అగర్వాల్ పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటే.. నవ్వుతో తీసుకుని కౌగిలించుకుంది. అంతేకాదు.. అతనితో డ్యాన్స్ కూడా చేసింది. దీంతో అమాయకుడైన అగర్వాల్.. నిజంగానే ప్రేమ ఒలకబోస్తుందని నమ్మేశాడు. కానీ దాని వెనుక గొంతుకోసే స్కెచ్ ఉందన్న సంగతి మాత్రం గ్రహించలేకపోయాడు. ఆ అమాయకత్వమే అతడ్ని ప్రాణాలతో లేకుండా చేసింది. ఈ ఘటనతో సోనమ్ రఘువంశీ కంటే పూణెకు చెందిన సియా గోయల్ దారుణమైన జిత్తులమారి అని తేలింది.

ఫిబ్రవరి 11న కేతన్-సియాల బంధం కుదిరింది. దీంతో ఫిబ్రవరి 19న లాంఛనంగా నిశ్చితార్థం జరిగింది. ఇక నవంబర్ 25న గ్రాండ్‌గా ఉధయ్‌పూర్ ప్యాలెస్‌లో పెళ్లి జరిపించాలని రూ.17 కోట్లు అడ్వాన్స్ కూడా చెల్లించారు. అతిథుల కోసం రెండు విమానాలు కూడా సిద్ధం చేశారు. ఇప్పటి నుంచే పెళ్లి సందడి మొదలైపోయింది. అయితే జూన్ 19న సియా గోయల్ బర్త్‌డే ఉంది. ఇందుకోసం కేతన్ భారీగా ఏర్పాట్లు చేశాడు. ఖరీదైన రెస్టారెంట్‌ను కూడా బుక్ చేశాడు. కానీ ఇంతలోనే జూన్ 18న కాబోయే భర్త రక్తాన్ని కళ్లరా చూసింది. కేతన్‌ను తీసుకెళ్లినప్పుడే.. ప్రియుడి చేతన్ కూడా చారిత్రాత్మక కోటకు రప్పించింది. కేతన్ కొండపై ఉన్నప్పుడు ఇద్దరూ తోసేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఇక కాబోయే భార్య సియా గోయల్‌కు పుట్టినరోజుకు ముందే ఆమెకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చాడు. కారులో కూర్చున్నప్పుడు సియా కళ్లకు గంతలు కట్టి ఒక అందమైన పువ్వు ఇచ్చాడు. వెంటనే నవ్వుతో కౌగిలించుకుంది. ఆ నవ్వులో భయంకరమైన హత్యా పథకం ఉందన్న సంగతి కేతన్ గ్రహించలేకపోయాడు. ఆమె ముఖ కవళికలను చూసిన వారు ఎవరూ కూడా ఊహించలేరు కూడా. ఇక హత్యకు ఒక నెల ముందు కూడా సియా పెట్టిన ఇన్స్టాగ్రామ్ పోస్టులు, వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన, ప్రేమపూర్వక సంబంధాన్ని చూపించాయి. ఆన్లైన్లో వారు ఒక ఆదర్శ జంటగా కనిపించారు. దీంతో ఎవరికీ అనుమానం రాలేదు.
కేతన్ ప్రేమను చూసైనా మనసు కరగలేదు.
కేతన్ ఇచ్చిన పువ్వును చూసి ప్రపంచమంతా తనకే దక్కినట్లుగా ఆమె ఆనందంతో వెలిగిపోయింది. ఆమె ముఖంలోని ఆ ఆనందం.. ఆమె హృదయంలో దాగి ఉన్న ద్వేషాన్ని బయటపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఆశ్చర్యం ఆమెకు మాటలు రాకుండా చేసింది. కేతన్ తన కారు పైకప్పును తెరవగానే అందమైన పూల అలంకరణలను చూసి సియా ముఖం ఆనందంతో నిండిపోయింది. ఆమె వెంటనే కేతన్‌ను కౌగిలించుకుంది. ఇక సియాను కౌగిలించుకున్నప్పుడు కేతన్ ఆనందానికి అవధులు లేవు. తాను ఎంతగానో ప్రేమించిన సియా తన ప్రాణాలను తీయాలని కంకణం కట్టుకుందని అతనికి తెలియలేద. ఆమె పన్నిన కుట్రను పసిగట్టలేకపోయాడు. సియా తనకు చూపించిన ప్రతీదాన్నీ కేతన్ నిజంగానే నమ్మాడు. సియా లాంటి కాబోయే భార్య ఉండటం తన జీవితాన్ని ఒక అద్భుత కథగా మార్చేసిందని అనుకున్నాడు. కానీ ముందున్న ప్రమాదం గురించి అతనికి ఏమాత్రం అవగాహన లేకపోయింది. అదే అతన్ని ముంచేసింది.
సియా పుట్టినరోజుకు ముందు జరిగే వేడుకను చిరస్మరణీయంగా చేయడానికి కేతన్ ఆమెను ఒక కేఫ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ లైవ్ మ్యూజిక్ నడుమ.. కేక్‌తో ఆమెకు ప్రపోజ్ చేశాడు. తన కాబోయే భర్త నుంచి అంత అందమైన సర్ప్రైజ్ అందుకున్న అమ్మాయిలాగే సియా కూడా చాలా సంతోషంగా కనిపించింది. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ కూడా చేశారు.
ఇక సియా తన పుట్టినరోజుకు ముందే ఒక సర్ప్రైజ్గా కేతన్‌ను లోహ్‌గఢ్ కోటకు ఆహ్వానించడమే కాకుండా.. తన ప్రియుడు అని చెప్పబడుతున్న చేతన్‌ను కూడా ఆహ్వానించింది. అనుమానం రాకుండా ఉండేందుకు చేతన్ తన మొబైల్ ఫోన్‌ను కొండ్వాలోని తన ఇంట్లోనే వదిలేశాడు. తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు అతను తన దుస్తులను కూడా మార్చుకున్నాడు. వాస్తవంగా జూన్ 18న భీకరమైన ఎండ ఉంది. ఆ సమయంలో కూడా చేతన్ హూడీ ధరించి లోహ్గఢ్కు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక లోహగఢ్ కోట దగ్గర కేతన్ తన మొబైల్ ఫోన్‌తో ఫోటోలు తీసుకుంటుండగా సియా అతడిని లోయలోకి తోసేసింది. ఆ తర్వాత సియా పోలీసులకు ఫోన్ చేసి.. కేతన్ కాలు జారి లోయలో పడిపోయాడని చెప్పింది. వెంటనే పోలీసులు, కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విధంగా సియా గోయల్ ప్లాన్ బి సఫలమైంది. ప్లాన్ ఏ మాత్రం మిస్ అయింది. ప్లాన్ బీ సక్సెస్ కాకపోతే ప్లాన్ సీ కూడా ఉంది. ప్లాన్ సీలో నేరుగా చేతన్ చౌదిరే.. కేతన్‌ను చంపేసి ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. తవ్వేకొద్దీ సియా కుట్ర కోణాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!