Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
- భార్య హింస ముందు ఓడిపోయాను..
- చేయి పట్టుకున్న భార్య కారణంగానే మరణం..
- ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Suicide: భార్య, ఆమె కుటుంబం వేధింపుల వల్ల తనువు చాలిస్తున్న భర్తల కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఒక యువ ఇంజనీర్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుషినగర్‌లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. మరణానికి ముందు ఒక వీడియోలో తన చావుకు భార్యనే కారణమని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
వెల్వా పాలక్ధారి గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ యాదవ్, మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. మరణించడానికి ముందు భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ నేను చనిపోయే సమయం ఇది కాదు. కానీ నా భార్య హింసను భరిస్తూ బతకడం నాకు ఇష్టం లేదు. నేను అకాల మరణం చెందానని ఎవరూ అనుకోకూడదు. అన్నయ్యా దయచేసి తల్లిదండ్రులకు కొడుకు లేడనే భావన కలుగనివ్వకు. ప్రతీ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో అండగా ఉండే కొడుకును ఆశిస్తారు. కానీ నా భార్య పెడుతున్న బాధల ముందు నేను వారి దు:ఖాన్ని మరిచిపోయాను. ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం ఇదే. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. దీనికి కారణం మరెవరో కాదు, నేను కొత్త జీవితం ప్రారంభించినప్పుడు నా చేయి పట్టుకున్న నా భార్యే. ఆమె వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, దాంతో నేను కుంగిపోయాను. ఆ కుంగుబాటుకు ఎంతగా కుంగిపోయానంటే, నా జీవితాన్ని ముగించుకున్నాను’’ అని వీడియో మెసేజ్‌లో చెప్పారు.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
2017లో కుషినగర్ సమీపంలోని సోహగ్ గ్రామానికి చెందిన అర్పిత యాదవ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత ప్రద్యుమన్‌తో కలిసి హర్యానాలో నివసించింది. 2020లో ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అర్పితా ప్రద్యుమన్‌పై వరకట్న వేధింపులు కేసు పెట్టింది. అప్పటి నుంచి అర్పిత తన 5 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లితో ఉంటోంది. కోర్టు కేసులు ప్రద్యుమన్‌ను మానసిక క్షోభకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!