Husband Killed Wife : పనికి పొమ్మంటే.. ప్రాణమే తీశాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో అనాలోచిత నిర్ణయాలతో చేసే పనులు చివరికి జీవితంలో అంధకారాన్ని మిగుల్చుతాయి. పని చేయకుండా ఇంట్లోనే ఉంటున్న భర్తను పనికి పొమ్మంటే.. ఏకంగా ఇల్లాలి ప్రాణాన్ని తీశాడో దుర్మార్గుడు. అంతేకాకుండా ఆతరువాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో విభోర్ సాహు అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే 15 రోజులుగా అతడు పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో పనికి వెళ్లాలంటూ భార్య పదే పదే చెప్పింది. కాగా, శుక్రవారం విభోర్ సాహూ తల్లి, సోదరుడు ఒక మతపరమైన వేడుక నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లారు.
దీంతో ఇంట్లో ఉన్న భర్త విభోర్ సాహూను పనికి వెళ్లాలంటూ భార్య రీతు (23) మరోసారి పోరుపెట్టడంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహం చెందిన విభోర్ సాహూ కోపంగా కత్తెరతో భార్యను పొడిచాడు. ఆమె కింద పడి రక్తం మడుగుల్లో మరణించింది. అనంతరం సాహూ ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, సోదరుడు… సాహూ, అతడి భార్య చనిపోవడాన్ని గమనించి.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాంఝీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సహదేవ్‌రామ్ సాహు వెల్లడించారు.
Also Read
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్‌కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్‌కు తెలియని సీక్రెట్ ఇదే..!
-
Billa Ranga Baasha: సుదీప్ మూవీకి భారీ ప్లాన్.. ‘బిల్లా రంగ బాషా’ ప్రమోషనల్ క్యాలెండర్ అవుట్
-
Ather Konarc Launched: తక్కువ ధరలో ఎక్కువ రేంజ్.. మెటల్ బాడీ, స్మార్ట్ ఫీచర్లతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
-
Taapsee Pannu: టాలీవుడ్లోకి తాప్సీ రీ ఎంట్రీ.. ఆ డైరెక్టర్‌తో హారర్ మూవీ?
-
H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!