Crime: పిల్లల ముందే భార్యని క్రూరంగా కొట్టి చంపిన కసాయి..
- పిల్లల ముందే భార్యని దారుణంగా కొట్టి చంపిన భర్త..
- బీహార్ ముజఫర్ పూర్ జిల్లాలో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో హృదయ విదారక సంఘటన జరిగింది. పిల్లల ముందే ఓ కసాయి భర్త తన భార్యను కొట్టి చంపాడు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. జిల్లాలోని మోతీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జింగా గ్రామంలో ఈ దారుణం జరిగినట్లు శనివారం పోలీసులు తెలిపారు.
నిందితుడిని మొహమ్మద్ కలీముల్లా అలియాస్ మున్నాగా గుర్తించారు. కలీముల్లా తన రెండో భార్య మెహ్రుహ్నిషాను కర్రలో దారుణంగా కొట్టాడు. ఆమె ప్రాణాలు కోల్పోయే దాకా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరి పిల్లలు సమీర్, సల్మాన్ సమక్షంలోనే ఆమెపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెహ్రుష్నిషా ఓ వివాహం కోసం అమ్మగారి ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి సొంతింటికి తిరిగి వచ్చిన కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
Read Also: Anchor Ravi : నేను హిందువునే.. నాపై ట్రోలింగ్ ఆపండి ప్లీజ్ : యాంకర్ రవి
గృహ వివాదంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. అతను కోపంతో మెహ్రుహ్నిషాపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలని రక్షించేందుకు గ్రామంలో ఎవరూ రాలేదు. పిల్లలు సాయం కోసం కేకలు వేసినప్పటికీ ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మహిళ మరణించిన తర్వాత, కలీముల్లా అక్కడ నుంచి పారిపోయాడు.
కలీముల్లా మొదటి భార్య మరణించింది, మెహ్రుహ్నిషాని రెండో పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని కనిపెట్టడం కోసం పోలీసులు టీమ్‌లను ఏర్పాటు చేశారు. బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైనర్ పిల్లల గుర్తింపును కాపాడటానికి వీడియోని షేర్ చేయవద్దని పోలీసులు ప్రజల్ని కోరారు.
తాజావార్తలు
-
Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మందాడి’..
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!