Indore Murder: గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్, హత్య చేసి ఇంత కూల్‌గా ఉన్నావేంట్రా.. భయం పుట్టిస్తున్న ఇండోర్ మర్డర్ కేసు..
- సంచలనంగా మారిన ఇండోర్ హత్య కేసు..
- గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారం, హత్య..
- చంపిన తర్వాత ఆత్మను పిలిచేందుకు క్షుద్రపూజ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indore Murder: ఇండోర్‌లో ఎంబీఏ విద్యార్థిని హత్య, అత్యాచారం కేసు సంచలనంగా మారింది. తన గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పీయుష్ ధమనోతియా దారుణకాండ వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంత క్రూరమైన హత్యకు పాల్పడినప్పటికీ మీడియా ముందు ఎంతో ప్రశాంతంగా, చిరు నవ్వుతో కనిపించడం అతడి క్రూరత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. నేరం చేశాననే పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలేదు. ‘‘ ఏం జరగాలో అంతా అయిపోయింది. వదిలేయండి, తెలుసుని మీరు ఏం చేస్తారు? సమయం వచ్చినప్పుడు అన్నీ చెబుతా’’ అంటూ మీడియాతో వ్యాఖ్యానించాడు.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, పీయూష్ తన గర్ల్‌ఫ్రెండ్‌పై అత్యాచారానికి పాల్పడి, గొంతు నులిమి, మళ్లీ శవంపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలింది. దీని తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయి, తన గర్ల్‌ఫ్రెండ్ ఆత్మను తిరిగి పిలిచేందుకు క్షుద్ర విద్యలు చేశాడు. కుటుంబం ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా కేసు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తూపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Also Read
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
వాట్సాప్‌లో యువతి అశ్లీల వీడియోలు..
ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి, మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బర్త్ సర్టిఫికేట్ కోసం కలెక్టరేట్ వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆమె తండ్రి దింపాడు. తర్వాత బాధితులురాలు తన చెల్లికి ఫోన్ చేసి క్లాస్‌మేట్, బాయ్‌ఫ్రెండ్ అయిన పీయుష్‌తో బర్త్ డే పార్టీకి వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి తిరిగి వస్తానని చెప్పింది. అయితే మళ్లీ ఇంటికి వెళ్లలేదు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విఛ్ ఆఫ్ అయింది. దీని తర్వాత, ఆమె అశ్లీల వీడియోలు కాలేజ్ వాట్సాప్ గ్రూప్‌కు షేర్ అయ్యాయి. ఆమె ముఖం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఆమెతో ఉన్న వ్యక్తి ముఖాన్ని ఏమోజీతో కవర్ చేశారు. ఇది పీయుష్ కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే వీడియోలను ఆమె స్టేటస్‌గా పెట్టాడు.
క్రూరంగా హత్య..
దీనిపై సమాచారం అందుకున్న కాలేజ్ యాజమాన్యం కుటుంబానికి సమాచారం ఇచ్చారు. దీని తర్వాత బుధవారం రాత్రి మిస్సింగ్ ఫిర్యాదు నమోదైంది. రెండు రోజుల తర్వాత శుక్రవారం పీయుష్ గది నుంచి దుర్వాసన రావడంతో పొరుగువారు పోలీసులకు తెలియజేశారు. తాళం పగలగొట్టి చూడగా అందులో యువతి నగ్న స్థితిలో కనిపించింది. ఆమె శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లో పీయుష్ యువతితో గదిలోకి వెళ్లి, 2.5 గంటల తర్వాత బ్యాగ్‌తో బయటకు వెళ్లినట్లు రికార్డైంది.
పోలీసులు చెబుతున్న దాని ప్రకారం, పీయూష్ సెక్స్ కోసం యువతిపై ఒత్తిడి తెచ్చాడని, అనారోగ్యం కారణంగా అందుకు ఒప్పుకోలేదని, కానీ బలవంతంగా రేప్ చేశాడని చెప్పారు. ఆమె కాళ్లు చేతులు కట్టేసి, గిఫ్ట్ ఇస్తానని చెప్పి, నోట్లో గుడ్డలు కుక్కి, ఛాతిపై కూర్చుని ఊపిరి ఆడకుండా హత్య చేశాడు. కత్తితో ఛాతిలో పొడిచాడు. గదిలోనే మృతదేహం పక్కన కూర్చుని బీర్ తాగాడు. శవంపై మళ్లీ లైంగిక దాడి చేశాడు. బట్టలు మార్చుకుని ముంబై, పన్వేల్ పారిపోయాడు. ముంబై పోలీసులు సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో తాను ఆమెను ప్రేమించానని, 15 రోజులుగా దూరంగా ఉంటుందని, ఆమె ఫోన్‌లో డేటింగ్ యాప్ చూడటంతో గొడవ అయినట్లు పీయుష్ చెప్పారు.
Horrifying News 🚨
Meet MBA monster Piyush Dhamnotiya who demanded sex to his girlfriend, She denied as she was unwell. He first assaulted her, tied her hands & feet, blindfolded her with a twisted "gift" excuse, gagged her with cloth, sat on her chest, strangled her till he… pic.twitter.com/vyt5dVklwC— Voice of Hindus (@Warlock_Shubh) February 18, 2026
తాజావార్తలు
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్‌గా..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!