Man Kills Daughter: పరువు హత్య.. కూతురు, ఆమె లవర్‌ను చంపేసిన తండ్రి..
- గుజరాత్‌లో పరువు హత్య..
- ప్రేమిస్తుందనే కోపంతో కూతురు, ఆమె లవర్‌ను చంపిన కుటుంబం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Kills Daughter: గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిందనే కారణంతో కుమార్తెను, ఆమె లవర్‌ను తండ్రి దారుణంగా హత్య చేశారు. గత నెల రోజులుగా అదృశ్యమైనట్లు భావిస్తున్న ఇద్దరి మృతదేహాలు ఖంభాలా గ్రామంలోని ఒక బావిలో దొరికాయి. బాధితులిద్దరు కూడా ఫిబ్రవరి 3 నుంచి కనిపించడం లేదు. వీరిద్దరు అదృశ్యమైనట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే, పోలీస్ విచారణ తర్వాత యువతి కుటుంబ సభ్యులే వారిని హత్య చేసినట్లు తేలింది.
Read Also: Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
బాధితులను 19 ఏళ్ల నాథి(అలియాస్ సోను రబారి) , 21 ఏళ్ల నవీన్ జీవాభాయ్ రబారిగా గుర్తించారు. వీరిద్దరిపై నఖత్రాణా పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదైంది. స్థానిక అధికారులు కేసును లోతుగా విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మహిళ తండ్రి తన కుమార్తె, నవీన్‌లో ప్రేమాయణం కొనసాగించడం ఇష్టం లేకే హత్య చేసినట్లు తేలింది. నవీన్‌తో సంబంధాన్ని తెంచుకోవాలని నాథిని పలుమార్లు కోరినప్పటికీ ఆమె వినకపోవడంతో ఇద్దరిని హత్య చేశాడు.
సంఘటన జరిగిన రోజున తండ్రి, అతడి మేనల్లుడు బైక్‌పై ఇద్దరిని ఖంభాలా గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేలా చేశారు. అక్కడ మహిళ తల్లి, సోదరుడు కూడా ఉననారు. వీరంతా కలిసి ఇద్దరి గొంతులు నొక్కేసి హత్య చేసినట్లు తెలుస్తోంది. నేరాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో నిందితులు మృతదేహాలనున బావిలో విసిరేశారు. ఈ కేసులో తండ్రి, అతడి మేనల్లుడు, మహిళ మైనర్ సోదరుడు సహా నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!