Delhi Lodge Case: హనీ ట్రాప్ చేసి చంపేసింది.. ‘సారీ’ నోట్ పట్టించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap Angle In Delhi Lodge Case, Police Solved: ఢిల్లీ లాడ్జ్‌లో శవమై కనిపించిన వ్యాపారవేత్త దీపక్ సేథి హత్య కేసుని పోలీసులు ఛేధించారు. హనీ ట్రాప్‌లో అనుకోకుండా ఈ హత్య జరిగిందని తేల్చారు. ఆయన్ను దోచుకోవాలన్న ఉద్దేశంతో హనీ ట్రాప్ చేసి లాడ్జికి తీసుకెళ్లారని, అక్కడ ఆయనకు ఇచ్చిన మత్తు మందు ఓవర్‌డోస్ కావడంతో మృతి చెందినట్టు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన 29 ఏళ్ల ఉషా అనే మహిళను అరెస్ట్ చేశారు. ఆమె హర్యానాలోని హనీ ట్రాప్‌తో దోచుకునే ముఠాకు చెందిన మహిళ అని పోలీసులు తెలిపారు. తనని తాను అంజలి, నిక్కీ, నికితలతో పాటు మరెన్నో మారు పేర్లతో వ్యాపారవేత్తలతో పరిచయం చేసుకొని, వారిని బుట్టలో పడేసేది. వారిని హోటళ్లకు తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి దోచుకునేది. దీపక్ సేథి విషయంలోనూ అదే ప్లాన్‌ని హనీ ట్రాప్ ముఠా రిపీట్ చేసింది.
NTR 30: ఈరోజే లాస్ట్… యాక్షన్ ఎపిసోడ్ ని అదరగొట్టేసారట
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మార్చి 30వ తేదీన రాత్రి 9:30 గంటల సమయంలో ఉషాతో కలిసి దీపక్ సేథి బల్జీత్ లాడ్జ్‌కి వెళ్లారు. రూమ్‌లో కాసేపు గడిపిన ఉషా.. 12:24 గంటల సమయంలో రూ.1100, జ్యువెల్లరీతో బయటకు వచ్చింది. వెళ్తూ వెళ్తూ.. ‘సారీ’ అంటూ ఒక నోట్ రాసి వెళ్లింది. అదే ఆమెను పట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృతుడి ఫోన్‌ని పరిశీలించారు. అతనికి వచ్చిన ఫోన్ నంబర్లలో.. ప్రధాన నిందితురాలితో సహా కొన్ని అనుమానిత నంబర్లను గుర్తించారు. ఉషా నంబర్ సంత్‌గఢ్ ప్రాంతంలో రీఛార్జ్ అవ్వడంతో.. ఆ లోకేషన్‌ని ట్రేస్ చేసి, అక్కడికి చేరుకున్నారు. అక్కడ వారికి ఒక నైజీరియన్ వ్యక్తి దొరకడంతో.. అతడ్ని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అతడు సహజీవనం చేస్తున్న మధుమిత స్నేహితురాలే ఉషా అని తేలడంతో.. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 2022లో పానిపట్‌లో నమోదైన కేసులో ఉషా జైలు శిక్ష కూడా అనుభవించిందని.. అక్కడే ఆమెకు మధుమితతో పరిచయం ఏర్పడిందని తెలిసింది. మధుమితనే దీపక్ సేథీని ఉషాకు పరిచయం చేసినట్లు పోలీసులు వివరించారు.
Akhira: నాన్న రాజకీయాల్లోకి, కొడుకు సినిమాల్లోకి… ఆరడుగుల బుల్లెట్ ఎంట్రీ ఎప్పుడు?
దీపక్ సేథి ఒక పెద్ద వ్యాపారవేత్త కావడంతో.. అతడ్ని హనీ ట్రాప్ చేసి దోచుకోవాలని ఉషా ప్లాన్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అతడ్ని చంపే ఉద్దేశం తనకు లేదని, కేవలం మత్తు మందు ఇచ్చి, అతడ్ని దోచుకోవాలని అనుకున్నానని పోలీసుల విచారణలో ఉషా తెలిపింది. అయితే.. తానిచ్చిన మత్తు మందు ఓవర్‌డోస్ అవ్వడం వల్ల అతడు చనిపోయాడని తెలిపింది. అందుకే.. లాడ్జ్ గది నుంచి బయటకు వెళ్లే ముందు ‘సారీ’ నోట్ వదిలి వెళ్లినట్టు ఆమె తెలిపింది. అలాగే.. సేథీ నుంచి ఆమె తీసుకున్న మొబైల్ ఫోన్, నగదు, డబ్బు తదితరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!