మనషుల్లో విలువలు రోజు రోజు దిగజారి పోతున్నాయి. క్షణిక సుఖాల కోసం వివాహేతర సంబంధాలు… డబ్బు కోసం మన, తన తేడా లేకుండా ఒకర్నొకరు చంపుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. సరిగ్గా ఇలాంటి కోణంలోనే ఒక హత్య జరిగింది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన హత్య.. దిగజారుతున్న మానవ సంబంధాల్ని, ఆర్థిక బంధాలకు అద్దం పట్టింది. అత్యంత దారుణంగా తల, మొండెం వేరు చేశారు. అది శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ శివారులో అటుగా వెళ్లే వారికి ఏదో వాసన రావడంతో అటుగా వెళ్లి చూశారు. అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొండెం లేని తల కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ వ్యక్తి తల ఉంది. దానికి దాదాపు 50 మీటర్ల దూరంలో మొండెం పడి ఉంది. ఒంటి మీద కత్తి పోట్లు
ఉన్నాయని నిర్ధారించారు..
READ MORE: HYD Wife Death: భార్యాభర్తలిద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. కానీ ఏం లాభం!
శవం పక్కనే ఒక కొత్త స్కూటీ గుర్తించారు పోలీసులు. స్కూటీ, మొబైల్ ఫోన్ ఆధారంగా చనిపోయిన వ్యక్తి పేరు బుగుడే విశ్వనాధ్ అని తేలింది. అతనిది తనకల్లు మండలం ఎర్రగుంటపల్లి. వెంటనే అతని భార్య శ్యామలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె చెప్పిన వివరాలు.. అలాగే తమ దైన కోణంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీంతో అసలు విషయం తేలింది.. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల క్రితం ఓడి చెరువు మండలం గాజుకుంటపల్లికి చెందిన బెట్టకుండ వెంకట రమణ అలియాస్ రమణ పెద్దకూతురు శ్యామలతో వివాహం జరిగింది. మొదట్లో వీరి సంసారం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత విశ్వనాథ్ ఆలోచనలు తప్పుదోవ పట్టాయి. శ్యామల చెల్లెలు అయిన మరదలుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఆమె తండ్రి రమణ తీవ్ర స్థాయిలో కోపం పెంచుకున్నాడు. అక్కడితో ఆగకుండా విశ్వనాథ్ తన అత్త పేరిట ఓడి చెరువు మండలం గాజుకుంటపల్లిలో ఉన్న విలువైన భూములు అమ్ముకున్నాడు. ఇది ఎవరికీ తెలియకుండా చేశాడు. వాస్తవంగా ఆ భూమి తన కుమారులకు రావాలి కానీ.. విశ్వనాథ్ ఎలా తీసుకుంటాడని మరింత కోపం పెంచుకున్నాడు. ఓ వైపు తన చిన్న కూతురితో సంబంధం పెట్టుకుని పెద్దకూతురికి అన్యాయం చేశాడు. చిన్న కూతురు సంసారంలో అలజడులు సృష్టించాడు. ఇక కుమారులకు దక్కాల్సిన ఆస్తిని ఇలా కాజేశాడు. విశ్వనాథ్ చేసిన ద్రోహానికి ఎలాగైనా పగ తీర్చుకోవాలని.. ఇక దీన్ని ఉపేక్షించకూడదని. ఒక కఠిన నిర్ణయం తీసుకున్నాడు..
READ MORE: Arunachalam Murder: అరుణాచలంలో తెలంగాణ భక్తుడి దారుణ హత్య.. ఎందుకు చంపారంటే..?
విశ్వనాథ్‌ను హత్య చేస్తే తన కోపం చల్లారుతుందని భావించాడు. వెంటనే రమణ.. తన స్నేహితుడు గాజుకుంటపల్లికి చెందిన రమణప్పకు విషయం చెప్పాడు. అప్పటికే రమణప్ప.. రమణకు కొంత డబ్బు కూడా ఇవ్వాలి. అయితే ఆ డబ్బు వద్దని.. ఇంకా నీకే 2 లక్షలు ఇస్తానని తన అల్లుడు విశ్వనాథ్‌ను హత్య చేయాలని చెప్పాడు. మొత్తం ఈ హత్యకు నాలుగు లక్షలకు సుఫారీ తీసుకున్నాడు రమణప్ప. యర్రాయపల్లికి చెందిన రామక్రిష్ణ, మధుబాబు, శెట్టివారిపల్లికి చెందిన శంకరను సంప్రదించాడు. ఈ హత్య చేస్తే మీకు కూడా కొంత డబ్బు ఇస్తానని నమ్మబలికాడు. ఇందుకోసం నాలుగు నెలల ముందు నుంచే పక్కా ప్లాన్ వేసుకున్నారు. 4 నెలల నుంచి విశ్వనాధ్‌తో పరిచయం పెంచుకుని చనువుగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో విశ్వనాధ్‌కు డబ్బు అవసరం ఏర్పడింది. ఈ డబ్బు ఇస్తానని చెప్పి విశ్వనాథ్‌ను ముదిగుబ్బకు రమ్మని చెప్పాడు రమణప్ప. కాటమయ్య బత్తలపల్లికి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్లు కమతం రామక్రిష్ణ, మధుబాబును మాట్లాడుకుని వీరు ముగ్గురూ కలిసి ఈ నెల 1న విశ్వనాథ్‌ను పిలిపించారు. పథకం ప్రకారం ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు దగ్గరలో గల అటవీ ప్రాంతంలోకి మద్యం తాగుదామని నమ్మించి పిలుచుకుని వెళ్లారు. విశ్వనాథ్ టూ వీలర్‌పై అక్కడికి చేరుకున్నాడు. అందరూ కలసి మద్యం తాగారు. విశ్వనాథ్ కాస్త మత్తులోకి జారుకున్నాక.. తమ వెంట ఆటోలో తెచ్చుకున్న వేట కొడవళ్లతో ఒక్కసారిగా తలను పొట్టేలు తల నరికినట్టుగా నరికారు. దీంతో ఒక్కసారిగా తల మొండం వేరు అయింది. ఆ తర్వాత తలను దూరంగా పడేసి అక్కడి నుంచి పారిపోయారు.. ఇలా తన కూతుర్ని ఇచ్చి కన్యాదానం చేసిన వ్యక్తి ఇంత దారుణంగా హత్య చేయించాడు. ఇక్కడ రమణది ఎంత తప్పు ఉందో.. విశ్వనాథ్ కూడా కొన్ని తప్పులు చేశాడు. వీరిద్దరు అనాలోచితంగా చేసిన తప్పులకు చివరకు ఇక్కడ ఆరేడు కుటుంబాలు బలయ్యాయి. దిగజారిపోతున్న మానవ సంబంధాలకు ఈ సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది..