Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..
- ప్రేమసి కోసం 15 ఏళ్ల బాలుడు దారుణం.. తల్లిదండ్రులతో సహా సోదరుడి హత్య..
- పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కిరాతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. హత్యలు చేసినట్లు బాలుడు అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 7-8 రాత్రి ఘాజీపూర్ జిల్లాలోని నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ్హికలా గ్రామాన్ని ట్రిపుల్ మర్డర్ కేసు కుదిపేసింది. గొంతుకోసం హత్యలు చేసేందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ఘాజీపూర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ మాట్లాడుతూ.. నేరస్తుడిని అరెస్ట్ చేశామని, తండ్రి మున్షి బింద్(45),తల్లి దేవంతి బింద్(40) , అతని అన్నయ్య ఆశిష్ బింద్(20) గొంతు కోయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, చాలా రోజుల క్రితమే హత్యలు చేయాలని నిర్ణయించుకున్నట్లు, దాని కోసం వ్యవసాయ పనుల్లో గడ్డి కోసేందుకు వాడే ‘ఖుర్పా’ అనే ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు బాలుడు వెల్లడించినట్లు తెలిపారు. జూలై 7న ముగ్గురుని హత్య చేయడానికి విఫలయత్నం చేశానని, అయితే ధైర్యం రాకపోవడంతో ఆ పని చేయలేదని చెప్పాడు.
ఆదివారం రాత్రి నిందితుడైన బాలుడు తన అన్న ఆశిష్‌తో గ్రామంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్ష,న్ ఆర్కెస్ట్రా చూసేందుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతా నిద్ర పోతున్న సమయంలో మద్యం సేవించి తండ్రి, తల్లి, సోదరుడి గొంతు కోశాడు. నేరం చేసిన తర్వాత దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని దాచేసి, ఏం తెలియని విధంగా అదే ఆర్కెస్ట్రా షో చూసేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు వచ్చి తన వారిని ఎవరో చంపారని స్థానికులకు చెప్పాడు. మున్షీ సోదరుడు రామ్ ప్రకాష్ బింద్ తన గ్రామానికి చెందిన రాధే బింద్ మరియు అతని సహచరులు ముగ్గురిని హత్య చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు, మున్షి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత దారుణమైన హత్యల గురించి వెల్లడించారు. బుధవారం బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!