UP: వామ్మో.. వాడు తప్పిపోయిన కొడుకు కాదు.. బయటపడ్డ నిజస్వరూపం
- ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డ కొత్త తరహా దోపిడీ వ్యవహారం
- తప్పిపోయిన కొడుకునంటూ ఇంట్లో చేరి చోరీలు
- చాకచక్యంగా పట్టుకున్న యూపీ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో కొత్త తరహా దోపిడీ వ్యవహారం బయటపడింది. నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని కటకటాల వెనక్కి పంపించారు. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది.
ఇటీవల రాజు అనే యువకుడు ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. 30 ఏళ్ల క్రితం తాను కిడ్నాప్‌కు గురైనట్లు.. సోదరితో స్కూల్‌కి వెళ్తుండగా అగంతకులు ఎత్తుకెళ్లిపోయారని స్టోరీ చెప్పాడు. నిజమే అనుకుని పోలీసులు ఆశ్రయించి.. ప్రకటనలు ఇచ్చారు. ఓ వ్యక్తి.. తప్పిపోయిన మేనల్లుడే అనుకుని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లు కూడా ముచ్చటపడ్డారు. తప్పిపోయిన బిడ్డ తిరిగి వచ్చాడని ఎమోషనల్ అయ్యారు. ఇంట్లో పరిస్థితులు అన్ని కుదిటపడ్డాక.. అతగాడి నిజస్వరూపం బయటపడింది. ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరా తీయడం మొదలుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు.. డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహించారు. డీఎన్‌ఏ టెస్ట్‌లో కుటుంబ సభ్యులతో సరిపోలేదు. దీంతో తమదైన శైలిలో విచారిస్తే.. రాజు నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడా పిల్లలు తప్పిపోయిన కుటుంబాలు ఉన్నాయో.. ఎంక్వైరీ చేసి వారి ఇంట్లోకి ప్రవేశించి ఆస్తులు వివరాలు తెలుసుకుని దోపిడీ చేస్తున్నట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
ఇది కూడా చదవండి: Pushpa 2: రెండో రోజుకే 500 కోట్ల క్లబ్బులో పుష్ప.. అస్సలు తగ్గేదేలే!
పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు రాజస్థాన్‌కు చెందిన రాజుగా గుర్తించారు. అతడు దొంగతనాలకు అలవాటుపడటంతో విసుగు చెందిన కుటుంబసభ్యులు 2005లో బయటకు గెంటేశారని తెలిపారు. అప్పటినుంచి పిల్లలు తప్పిపోయిన కుటుంబాల వివరాలు సేకరిస్తూ.. పేరు మార్చుకొని తానే వారి కుమారుడినని నమ్మించి.. వారి ఇంట్లో తిష్ఠ వేసే వాడనని చెప్పారు. కొన్ని రోజుల అనంతరం ఆ ఇంట్లోని విలువైన వస్తువులు దోచుకొని ఎవరికీ చెప్పకుండా ఉడాయించేవాడని తెలిపారు. అలా ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోని హిసార్, సిర్సాలోని తొమ్మిది కుటుంబాలను మోసం చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇది కూడా చదవండి: INDIA Alliance: ఇక ఇండియా కూటమి సంగతి అంతేనా.. కాంగ్రెస్‌కి ‘హ్యాండ్’ ఇస్తున్న మిత్రులు..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!