Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- నమ్మకస్థురాలే రక్తం పారించింది
- వివాహేతర సంబంధాన్ని మానుకోమనడమే శాపమైంది
- వీడిన కృష్ణా జిల్లా గన్నవరం మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి పక్కనే నమ్మకంగా ఉన్నారు.. పొరుగు వారే కదా..!! అని నమ్మి ఇంట్లోకి రానిస్తే.. ఆ వృద్ధురాలినే హత్య చేశారు. డబ్బులు అప్పు అడిగితే ఇవ్వలేదన్న కారణం ఒకటైతే.. తన వివాహేతర బంధానికి అడ్డు వస్తోందనే కారణం మరొకటి. మొత్తంగా ఆ వృద్ధురాలిని.. కన్న కొడుకుతో కలిసి మరీ చంపేసింది ఓ మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వృద్ధురాలి పేరు కాజ రజిత కుమారి. కృష్ణా జిల్లా గన్నవరం దావాజీ గూడెం రోడ్డులోని జీఆర్కే ప్యారడైజ్ భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. రజిత శ్రీనగర్ కాలనీలో పిండి మర నడుపు కొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే కాలనీలో నివాసం ఉండే పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కొంతకాలంగా రజిత వద్ద అప్పులు తీసుకొని చిట్టీలు కడుతూ సన్నిహితంగా ఉండేవారు. సుష్మ, ఆమె కుమారుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుగా డబ్బులు కావాలని కొంతకాలంగా రజితను అడిగారు. రజిత ఇస్తానని చెబుతూ పదే పదే మాటదాటేస్తూ వచ్చింది.
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
మరోవైపు.. గన్నవరానికి చెందిన ఓ న్యాయవాదితో సుష్మకు వివాహేతర సంబంధం ఉంది. ఐతే ఈ విషయం తెలిసిన రజిత.. అది మంచిది కాదని.. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. రజిత.. ఆ న్యాయవాదిని సైతం హెచ్చరించింది. ఈ కారణంగా అతడు సుష్మకు దూరంగా ఉంటున్నాడనే అపోహతో ఆమెను హత్య చేయాలని సుష్మ ప్లాన్ చేసింది. ఇందుకోసం కొడుకు సాయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే మే 24న రాత్రి 11 గంటల సమయంలో రజిత.. అమెరికాలో ఉన్న తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని ఫోన్ కట్ చేశారు. అనంతరం కూతురు తిరిగి ఫోన్ చేస్తే కలవలేదు. ఉదయాన్నే పని మనిషి వచ్చి చూస్తే బెడ్ రూమ్‌లో రజిత రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమార్తె, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రజిత మృతదేహం పైన పలు గాయాలు కనిపించాయి. అదీ కాకుండా.. ఇంట్లోని బంగారం, నగదు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. అపార్ట్ మెంట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ప్లాట్‌లోకి వచ్చినట్లు కనిపించింది. దీంతో ఇద్దరినీ పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. వాళ్ల అనుమానమే నిజమైంది. తల్లి, కొడుకు ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుల నుంచి రూ.66 లక్షల సొత్తు రికవరీ చేశారు పోలీసులు. మృతురాలు రజితను హత్య చేసి ఆమె వద్ద ఉన్న 300 గ్రాముల బంగారం, రూ.1.90 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి వినియోగించిన ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలవరపు ఆజయ్పై ఉయ్యూరు టౌన్లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు గుర్తించారు.
మొత్తంగా తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మిన పాపానికి రజిత ప్రాణాలు తీసేశారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సుష్మ, ఆమె కొడుకు అజయ్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!