తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో యేతరానికి అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తో ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ కోసం కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలు తమదైన ముద్ర వేసేశారు. హోస్ట్‌గా, లేదా నటుడిగా ఓటీటీ ఆడియెన్స్‌కి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యారు. కానీ ఇప్పటి వరకు చిరంజీవి మాత్రం ఓటీటీపై ఎలాంటి ప్రాజెక్ట్‌కి అంగీకారం ఇవ్వలేదు.
Also Read : Malavika Mohanan : హీరోయిన్ అవ్వకపోయింటే డైరెక్టర్ అయ్యేదాని..
అయితే తాజాగా జరిగిన ‘కుబేర’ ఈవెంట్‌లో చిరంజీవి ఓటీటీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తనకు ‘ది ఫ్యామిలీ మాన్’ వంటి ప్రముఖ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చినప్పటికీ, అప్పట్లో టైమ్, స్క్రిప్ట్ కరెక్ట్ అనిపించక రిజెక్ట్ చేశానని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందని.. ‘సరైన పాత్ర, మంచి కథ ఉంటే ఓటీటీ కోసం నేను రెడీ’ అని స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్ ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి నెలకొంది. ఆయన్ను ఓ వెబ్ సిరీస్ లేదా ఓటీటీ మూవీలో చూడాలనే కోరిక ఉన్న ఫ్యాన్స్‌కి, ఇది గుడ్ న్యూస్ లాంటిదే. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ప్రాజెక్ట్స్ పూర్తయిన తర్వాత ఓటీటీ ఎంట్రీ కి సంబంధించి ఓ అధికారిక ప్రకటన వస్తుందా అన్నది వేచి చూడాల్సిందే.