Engagement Off: ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిందనే కోపంతో.. అమ్మాయి తల నరికిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Engagement Off: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందనే కోపంతో అమ్మాయి తల నరికి, ఆ తలతో పారిపోయిన ఘటన రాష్ట్రంలోని మడికేరిలో జరిగింది. నిశ్చితార్థానికి కొన్ని గంటల మందు అధికారులు ఈ వేడుకలను ఆపేశారు. అమ్మాయికి 16 ఏళ్లు కావడంతో, మైనర్ అయినందుకు అధికారులు నిశ్చితార్థాన్ని గురువారం ఆపేశారు. దీంతో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వ్యక్తి ఈ ఘాతుకానికి ఓడిగట్టాడు.
Read Also: US: న్యూయార్క్‌లో దారుణం.. మహిళపై దుండగుడి అఘాయిత్యం
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
32 ఏళ్ల ప్రకాష్ అనే వ్యక్తి ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మీనా అనే 16 ఏళ్ల బాలికను మడికెరిలోని సుర్లబ్బి గ్రామంలో వివాహం చేసుకోనున్నాడు. అయితే, వీరి అమ్మాయి మైనర్ కావడంతో ఈ సమాచారాన్ని స్థానిక శిశు సంక్షేమ శాఖకు గుర్తుతెలియని వ్యక్తి తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు బాలిక వయసు తక్కువగా ఉండటంతో ఆమెకు వివాహం చేస్తే పోక్సో, బాల్యవివాహాల చట్టాల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలియజేయడంతో కుటుంబీకులు నిశ్చితార్థాన్ని నిలిపేశారు. మీనకు 18 ఏళ్లు వచ్చే వరకు వివాహం చేయవద్దని కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వివాహం వాయిదా వేయడానికి అంగీకరించారు.
అయితే, ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రకాష్ బాలిక ఇంటికి వచ్చి ఆమె తల్లిదండ్రులపై దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మీనా తల్లిని తన్నడంతో పాటు తల్లిపై పదునైన వస్తువుతో దాడి చేశాడు. ఆ తర్వాత బాలికను ఇంటి నుంచి 100 మీటర్ల దూరం ఈడ్చకెళ్లి తల నరికి, ఆ తలతో పారిపోయాడు. ప్రకాష్ కనిపించకుండా పోవడంతో పోలీసులు అతడిని వెతుకున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడుగు ఎస్పీ రామరాజన్ కే చెప్పారు. ప్రకాష్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌లు 307 (హత్య ప్రయత్నం) మరియు 302 (హత్య), లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్‌తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!