Delhi: 25 ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు. ‘‘ 26 మే రోజున దోపిడి గురించి పోలీస్ కంట్రోల్ రూంకి ఓ కాల్ వచ్చింది.’’ అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లే సమయానికి మహిళ రక్తమోడుతూ ఉందని, పక్కనే ఆమె మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.
Read Also: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
మహిళని వెంటనే మెడికల్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, మే 26న బాధిత మహిళ బీహార్ నుంచి తన మూడేళ్ల కొడుకుతో కలిసి పంజాబ్‌లో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సర్దార్ మార్కెట్ వెళ్లింది. ఈ-రిక్షా ద్వారా తిరిగి మళ్లీ స్టేషన్ వచ్చే క్రమంలో, దాని డ్రైవర్ మహ్మద్ ఉమర్ మహిళకు కూల్‌డ్రింక్ అందించాడు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రతిఘటించినందుకు తలపై రాయితో దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు, మెలుకువ వచ్చిన తర్వాత తన మొబైల్ ఫోన్, రూ.3000 దొంగలించబడినట్లు చెప్పింది. దాదాపుగా 500 సీసీటీపీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 150 వరకు ఆటో రిక్షా డ్రైవర్లను విచారించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని హత్యయత్నం, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!