NTV Telugu Site icon

Cyber Crime: పిల్లలకు మీ మొబైల్‌ ఫోన్‌ ఇస్తున్నారా..? ఇలా కూడా జరగొచ్చు..!

Cyber Crime

Cyber Crime

Cyber Crime: ఇంట్లో వాళ్ల ఫోన్లు.. పెద్దవాళ్ల కంటే.. పిల్లల దగ్గరే ఎక్కువగా ఉంటున్నాయి.. పేరెంట్స్‌ ఇంట్లో అడుగు పెట్టారంటే చాలు.. వెంటనే వారి దగ్గర నుంచి స్మార్ట్‌ఫోన్లు లాగేస్తున్నారు చిన్నారులు.. స్మార్ట్‌ఫోన్లలో గేమ్స్‌.. రీల్స్‌.. వీడియోలు.. ఇలా ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారు.. అయితే, వాళ్లు ఆడుకోవడానికి ఎన్నో గేమ్స్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారు.. ఇదే మీకు పెద్ద ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం లేకపోలేదు.. ఆ సమయంలోనే సైబర్‌ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం కూడా ఉందనే ఓ ఘటన వెలుగు చూసింది.. సైబర్‌ నేరగాళ్లు రకరకాల ఆధునిక పద్ధతుల్లో అమాయక ప్రజల నుంచి డబ్బు లాగేందుకు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలోనే బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది.

Read Also: Telangana Thalli Statue: సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను ఓకే చేసింది. అప్పటికై కాచుకొని కూర్చున్న సైబర్ నేరగాళ్ల వాళ్ళపని వాళ్లు చేసుకుపోయారు.. ఇక ఈక్రమంలో సదరు మహిళకు వేటపాలెంలోని యూనియన్ బ్యాంకు ఖాతాలో వున్నా నాలుగు లక్షల రూపాయల నగదును విడతల వారీగా.. ఈ ఏడాది ఆగస్టు 18వ తేదీ నుండి సెప్టెంబర్ 24వ తేదీ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు ఈ మొత్తం నగదును అపహరించారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న సదరు బాధితురాలు వేటపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పిల్లలకు ఫోన్లు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తు్న్నారు పోలీసులు..