బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఓ మహిళా సైబర్ నేరగాళ్ల బారినపడింది. వేటపాలెం మండలం కటారివారిపాలెం కు చెందిన కాటంగారి అనిత.. చిరు వ్యాపారి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని నాలుగు లక్షల రూపాయల నగదును పోగొట్టుకుంది. చిరు వ్యాపారం చేసుకుంటూ కాస్తంత బిజీగా వుండే సమయంలో అనిత తన మొబైల్ ఫోన్ ను ఇంట్లోని తనకూతురుకి ఇచ్చింది. సరదాగా ఫోన్ చూస్తున కూతురు తెలిసో.. తెలియకో.. అందులోని సైబర్ నేరగాళ్ల పంపిణి ఓ లింక్ ను…