రెండో భార్య కూతురు…!! వరుసకు కూతురవుతుందన్న సోయి లేదు. మైనర్ అమ్మాయి అనే జాలి లేదు. విచక్షణ మరిచి.. కామాందుడిలా ప్రవర్తించాడు. స్టార్ హీరోలకు స్టెప్పులు నేర్పిన కొరియోగ్రాఫరే ఐనా… తన నీచపు బుద్ధితో పరువు బజారుకీడ్చుకున్నాడు. కూతురిని వేధించడంతో తట్టుకోలేకపోయిన తల్లి.. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కొరియోగ్రాఫర్ కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పోక్సో కేసు నమోదు చేశారు. లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టైన కేసు మరవక ముందే… మరో మాస్టర్ ఇలాంటి కేసులోనే ఇరుక్కున్నాడు. ఏకంగా కూతురు వరుసయ్యే మైనర్ అమ్మాయిని వేధించి అడ్డంగా బుక్ అయ్యాడు. అతడిపై తన భార్యే ఫిర్యాదు చేసింది.. ఇతను కొరియోగ్రాఫర్ కృష్ణ. ఢీ.. బేబీ జోడీ.. డ్యాన్స్ ఐకాన్ వంటి ప్రొగ్రాంలతో ఫేమ్ అయ్యాడు. యంగ్ హీరోల పాటలకు కూడా కొరియోగ్రఫీ చేశాడు. కెరీర్‌లో ఉన్నతంగా ఎదుగుతున్న సమయంలోనే… తన నీచపు బుద్ధిని బయటపెట్టుకున్నాడు. తన రెండో భార్య కూతురును లైంగికంగా వేధించాడు కృష్ణ. కూతురును వేధించడం తట్టుకోలేకపోయిన తల్లి… గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు.. భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేయగానే కృష్ణ పరార్ అయ్యాడు. గాలించిన పోలీసులు… బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో తన అన్న ఇంట్లో తలదాచుకున్న కృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. కంది జైలుకు తరలించారు..
READ MORE: Hyderabad: వీకెండ్ వచ్చిందంటే చాలు… హైదరాబాద్ శివారు బాట పడుతున్న యువత..!
అరెస్ట్ తర్వాత కృష్ణ మాస్టర్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులు, మహిళలను పరిచయం చేసుకుని.. మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని పీఎస్‌లలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఓ యువతిని వివాహం చేసుకున్న కృష్ణ మాస్టర్… ఆమెకి చెందిన తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని పరార్ అయినట్లు తెలుస్తోంది. మొదటి భార్యకు దూరంగా ఉంటున్న కృష్ణ రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఓ కూతురు కూడా ఉంది. ఈ మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులకు దిగాడు కృష్ణ. వరుసకు కూతురు అవుతుందన్న సోయి కూడా మరిచి తన కామ బుద్ధి చూపాడు కృష్ణ. తన కూతురుపై జరుగుతున్న అఘాయిత్యాన్ని గుర్తించిన తల్లి… కృష్ణను పలుమార్లు మందలించింది. హెచ్చరించింది. అయినా తీరు మార్చుకోకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది కృష్ణ భార్య. రెండో వివాహం చేసుకున్న యువతిని కూడా కృష్ణ ట్రాప్ చేసి వివాహం చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చూస్తున్న యువతిని.. ట్రాప్ చేశాడు కృష్ణ. అవకాశాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి… 18 ఏళ్లుగా తనతో కాంటాక్ట్‌లో ఉంటూ… మొదటి భార్య దూరం కాగానే ఈ మహిళను రెండో వివాహం చేసుకున్నాడు కృష్ణ…