చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి అమానుషమైన, చట్టవిరుద్ధ చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టింది. ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 18 టీమ్లను ఏర్పాటు చేసి, రైడ్లు నిర్వహించి షాకింగ్ వివరాలను వెలికితీసింది. ఆపరేషన్లో భాగంగా చైల్డ్ పోర్న్ వీడియోలను చూస్తూ, షేర్ చేస్తూ, డౌన్లోడ్ లేదా అప్లోడ్ చేస్తూ ఉన్న 24 మంది యువకులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఎక్కువ మంది నిందితులు హైదరాబాద్కు చెందినవారేనని, అరెస్ట్ అయిన వారి వయస్సు 18 నుంచి 48 సంవత్సరాల మధ్యగా ఉన్నట్టు అధికారిక సమాచారం. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే వీరిలో చాలామంది మిడిల్ క్లాస్ వర్గానికి చెందిన వర్కింగ్ ప్రొఫెషనల్స్. అంతేకాక, నిందితుల్లో ఒకరు ఇరిగేషన్ శాఖ ఉద్యోగి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
Question Paper Leak : అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ గుట్టురట్టు.. 35 మంది విద్యార్థులపై వేటు..!
సైబర్ యూనిట్ వెల్లడించిన వివరాల ప్రకారం వీరు యాక్సెస్ చేసిన వీడియోల్లోని బాధితులంతా విదేశాలకు చెందిన, 4 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల చిన్నారులే. నేషనల్, ఇంటర్నేషనల్ డేటాబేస్ల ద్వారా ఈ వీడియోలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో హైదరాబాద్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పబ్లకు వెళ్లే యువతులను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి సన్నిహితంగా మారి, తర్వాత వారి ఫోటోలు, వీడియోలను కారణంగా చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న రానా ప్రతాప్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పబ్స్ కు వెళ్ళే అమ్మాయిలను టార్గెట్ చేసుకొని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పక్క టేబుల్ లో ఇన్నోసెంట్ అమ్మాయి కనిపిస్తే ట్రాప్ చేసి, మాయమాటలు చెప్పి లోబర్చుకుని కోరిక తీర్చాలని బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఒక యువతి నుంచి 1 కోటి 30 లక్షలు డబ్బు వసూలు చేశాడు. దీంతో బాధిత యువతి ఫిలిం నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు. 18 నెలల్లో కేటుగాడు రూ.కోటి వసూలు చేసినట్లు తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు రానా ప్రతాప్ రెడ్డి ని రిమాండ్ తరలించిన పోలీసులు వెల్లడించారు.
APSRTC Rental Bus Owners Strike Call Off: ఏపీఎస్ఆర్టీసీలో సమ్మెకు తెర..