చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!
- ఫామ్‌హౌజ్‌లో స్టూడెంట్స్ భారీ పార్టీ..
- పార్టీని భగ్నం చేసిన ఎస్వోటీ, స్థానిక పోలీసులు.
- పార్టీలో 40 మంది స్టూడెంట్స్ ఉన్నట్లు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ శివారులోని ప్రముఖ ‘ఎల్జీ (LG) ఫామ్‌హౌస్’లో కొందరు యూనివర్సిటీ విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న భారీ పార్టీని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) మరియు స్థానిక చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు.పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. శంకరపల్లి మండలం దొంతన్‌పల్లి పరిధిలోని ‘ఐబీఎస్ ఇక్ఫాయ్ (IBS IFHE) యూనివర్సిటీ’కి చెందిన బీబీఏ, ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ బృందాలు, చేవెళ్ల పోలీసులు ఒకేసారి ఫామ్‌హౌస్‌పై ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడి సమయంలో సుమారు 40 మందికి పైగా విద్యార్థులు అక్కడ ఉన్నట్లు, వారిలో దాదాపు 20 నుంచి 25 మంది యువతులు కూడా ఉన్నట్లు సమాచారం.
పోలీసులను చూడగానే విద్యార్థులు పరుగులు తీసే ప్రయత్నం చేయగా, సిబ్బంది అందరినీ చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ పార్టీలో మద్యం ఏమైనా అక్రమంగా సరఫరా చేశారా? లేక నిషేధిత మత్తు పదార్థాలు (డ్రగ్స్) ఏవైనా వినియోగించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఫామ్‌హౌస్ యజమాని అనుమతులు, పార్టీ నిర్వాహకుల వివరాలపై ఎస్వోటీ ఆరా తీస్తోంది. విద్యాసంస్థల సమీపంలో మరియు శివారు ఫామ్‌హౌస్‌లలో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read
- Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..
- Fake Jobs: ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్యోగాల ఎర.. లక్షలు కాజేసిన కేటుగాళ్లను అరెస్ట్ చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు..
- Eagle Force: యూనివర్సిటీ క్యాంపస్‌లలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లపై 'ఈగిల్ ఫోర్స్' ఉక్కుపాదం
- Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
తాజావార్తలు
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!