Cellphone Suicides: ప్రాణాలు తీసిన సెల్ ఫోన్ వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన సెల్ ఫోన్ స్నేహితుడు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఒకరు చనిపోగా… బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించలేక మరో స్నేహితుడు మనోవేదనతో ఉరేసుకొన్నాడు. ఫోన్ విషయంలో తలెత్తిన వివాదం ఇరువురి మధ్య చిచ్చురేపింది. క్షణికావేశంలో తీసుకొన్న నిర్ణయాలతో రెండు కుటుంబాలకు తీరని వేదన మిగిలింది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం బైరాపూర్ చెందిన నీరడి మహేష్, రాచకొండ సాయిలు స్నేహితులు. ఈ నెల 12న వీరిద్దరు కలిసి నస్రుల్లాబాద్లో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కుస్తీ పోటీల్లో మహేష్ గెలుపొందారు. అనంతరం స్వగ్రామానికి చేరుకొని ఇద్దరు మద్యం తాగారు.
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
ఆ సమయంలో మహేష్ సెల్ ఫోన్ పోవడంతో దాన్ని సాయిలు దొంగిలించారని భావించారు. తన తల్లితో కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్లి సెల్ ఫోన్ తిరిగివ్వమని అడిగారు. సాయిలు తనకు తెలియదని చెప్పడంతో మనస్తాపం చెందిన మహేష్ పురుగుల మందు తాగారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఈ నెల 13న మృతి చెందాడు. మహేష్ మరణానికి సాయిలే కారణమని భావించిన బంధువులు కుల పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకొని బాధిత కుటుంబానికి రూ. లక్ష పరిహారం ఇచ్చేలా రాజీ కుదిర్చారు.
సాయిలు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో అత్తారింటికి వెళ్లారు. పంచాయితీలో పరిహారం చెల్లించేలా పెద్దలు ఒప్పించడంతో ఆ డబ్బు కట్టలేక 16వ తేదీన ఏఆర్పీ క్యాంపు శివారులో చెట్టుకు ఉరేసుకొన్నారు. మహేష్ కు రెండేళ్ల బాలుడు, భార్య.. సాయిలుకు 8, 6 ఏళ్ల ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు. సెల్ ఫోన్ కారణంగా ఇద్దరు స్నేహితులు తిరిగి రానిలోకాలకు వెళ్ళిపోయారు.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!