Threat Call to SBI: లోన్ ఇవ్వకుంటే బ్యాంక్‌ను పేల్చేస్తా.. చైర్మన్‌ను లేపేస్తా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బడా బడా బాబుల సంగతి ఏంటో గానీ.. సాధారణ వ్యక్తులు లోన్ అడిగితే మాత్రం.. బ్యాంకులు.. ఆ పేపర్.. ఈ పేపర్ పేర్లతో తమ చుట్టూ తిప్పుకున్న సందర్భాలు అనేకం.. అయితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్‌కి వచ్చిన ఫోన్ కాల్ తీవ్ర కలకలం రేపుతోంది.. తనకు లోన్ మంజూరు చేయకపోతే బ్యాంక్ శాఖను పేల్చేస్తా.. బ్యాంక్ ఛైర్మన్‌నే కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ ఫోన్ చేసి మరీ హెచ్చరించాడు.. తాను రూ. పది లక్షల రూపాయల లోన్ కోసం ఇప్పటికే ఓసారి అభ్యర్థన పెట్టుకుంటే తిరస్కరించారని.. కానీ, ఈసారి కూడా అదే జరిగితే.. ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారాను కిడ్నాప్ చేసి లేపేస్తానంటూ బెదిరించాడు.
Read Also: Minister Vidadala Rajini: మంత్రులందరి కార్లపై దాడులు.. పవన్ కల్యాణే సమాధానం చెప్పాలి..!
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
ముంబైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గురువారం రోజు ఉదయం 11 గంటలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దక్షిణ ముంబై కార్యాలయానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి, రూ. 10 లక్షల రుణం మంజూరు చేయకపోతే బ్యాంక్ ఛైర్మన్‌ను కిడ్నాప్ చేసి హత్య చేస్తానని మరియు దాని కార్యాలయాన్ని కూడా పేల్చేస్తానని బెదిరించాడని పోలీసు అధికారి ఇవాళ తెలిపారు.. నారీమన్ పాయింట్‌లో ఉన్న బ్యాంకు శాఖకు ఈ బెదిరింపు కాల్ వచ్చిందని.. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తన పేరు మహ్మద్ జియా ఉల్ అలీగా పేర్కొని.. పాకిస్థాన్ నుంచి కాల్ చేస్తున్నట్లు బెదిరించారని బ్యాంక్ అధికారి తెలిపారు.. ఇక, బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఆ బెదిరింపు కాల్ పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినట్లు తేల్చారు. మరియు నిందితుడిని పట్టుకోవడానికి ముంబై పోలీసుల బృందం బెంగాల్‌కు బయల్దేరినట్టు వెల్లడించారు.
ఫోన్ చేసిన వ్యక్తి తనను మహ్మద్ జియా ఉల్ అలీగా పరిచయం చేసుకున్నాడని, తనకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంక్ ఆఫీస్ అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ అజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ గురువారం ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్బీఐ చైర్మన్‌ని కిడ్నాప్ చేసి హత్య చేస్తానని, రుణం మంజూరు చేయకపోతే బ్యాంకు కార్పొరేట్ కార్యాలయాన్ని బాంబుతో పేల్చేస్తానని కాలర్ బెదిరించాడు అని తెలిపారు. బెదిరింపు కాల్ తర్వాత, శ్రీవాస్తవ్ దక్షిణ ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు, ఆ తర్వాత ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506 (2) (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.. మొత్తంగా లోన్ ఇవ్వకపోతే.. బ్యాంక్ పేల్చేస్తాం.. చైర్మన్‌ను లేపేస్తాం అంటూ బెదిరింపులకు దిగడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
-
Aroopi OTT Release: తరతరాల శాపం… బొమ్మలో బంధించిన యక్షిణి.. ఓటీటీని వణికించేందుకు వస్తున్న ‘అరూపి’!
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!